Weight Loss Tips: శనగ పిండితో తయారు చేసిన రోటీలు తింటే బరువు తగ్గుతారా...?

Besan Roti For Weight Loss In 10 Days: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ శనగ పిండితో తయారు చేసిన రోటీలను తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలా రోటీలను తీసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 04:20 PM IST
  • శనగ పిండితో తయారు చేసిన రోటీలు తింటే..
  • కేవలం 10 రోజుల్లో బరువు తగ్గుతారు.
  • రోగనిరోధక శక్తి బలపడుతుంది.
 Weight Loss Tips: శనగ పిండితో తయారు చేసిన రోటీలు తింటే బరువు తగ్గుతారా...?

Besan Roti For Weight Loss In 10 Days: శనగ పిండితో తయారు చేసిన రోటీలు ఎక్కువగా దక్షిణ భారత ప్రజలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది ప్రస్తుతం  గోధుమ రోటీకి బదులుగా శనగ పిండితో చేసిన రొట్టెలను తీసుకుంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏమిటంటే.. ఈ రోటీల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. అయితే వీటిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గడమేకాకుండా అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ఉండే మూలకాలు జీర్ణవ్యవస్థ కూడా బలంగా మారుతుంది. రోటీలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమంగా తీసుకోడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

శనగపిండి చేసిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
బరువు తగ్గుతారు:

శనగపిండితో తయారు చేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన  కార్బోహైడ్రేట్, ఇనుము అధిక పరిమాణంలో లభిస్తాయి. బరువు తగ్గడానికి  గోధుమపిండితో తయారు చేసిన రోటిలకు బదులుగా శనగపిండి తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అంతేకాకుండా శనగ పిండిలో ఉండే పోషకాలు ఆకలిని నియంత్రించేందుకు సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఈ రోటీలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది:
శనగపిండితో తయారు చేసిన ఆహారాలను తినడం వల్ల రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బెసన్ రోటీలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరం బలహీనత సమస్యలను తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీర ఒత్తిడి నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

రోగనిరోధక శక్తి బలపడుతుంది:
శనగపిండితో తయారు చేసిన రోటీలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బెసన్ రోటీలో విటమిన్ బి, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు క్రమం తప్పకుండా వీటిని తీసుకోడం వల్ల సులభంగా రోగనిరోధక శక్తి పెరగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి నిపుణులను సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News