Low Glycemic Foods: గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఈ 6 ఆహారాలు మీ డైట్ లో ఉంటే బరువు పెరిగే ఛాన్స్ లేదు..

Low Glycemic Foods:  గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు డయాబెటిస్ వారికి మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు ,కొవ్వులు తక్కువగా ఉంటాయి. అయితే బెల్లీ ఫ్యాట్ పెరగకుండా ఉండడానికి కూడా  గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాల్లో మీ డైట్ లో చేర్చుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : Jun 14, 2024, 10:47 AM IST
Low Glycemic Foods: గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఈ 6 ఆహారాలు మీ డైట్ లో ఉంటే బరువు పెరిగే ఛాన్స్ లేదు..

Low Glycemic Foods:  గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు డయాబెటిస్ వారికి మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు ,కొవ్వులు తక్కువగా ఉంటాయి. అయితే బెల్లీ ఫ్యాట్ పెరగకుండా ఉండడానికి కూడా  గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాల్లో మీ డైట్ లో చేర్చుకోవాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవు. అంతే కాదు బరువు కూడా పెరగకుండా ఉంటారు. గ్లైసేమిక్ సూచి తక్కువగా ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

కూరగాయలు..
పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయల్లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ మోతాదులు ఉంటాయి. కానీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగు చేస్తాయి. అంతేకాదు మీకు కడుపు ఎక్కువ సేపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. బ్రోకోలి, పాలకూర, కాలే, క్యాలీఫ్లవర్ మీ డైట్ లో ఉండాలి.

బెర్రీలు..
ఇది మరో ఆరోగ్య కైరమైన ఆహారం. మీ డైట్ ప్లాన్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి సహజ సిద్ధంగా  చక్కెరను నియంత్రిస్తాయి. అంతేకాదు ఇందులో  గ్లైసేమిక్ సూచి కూడా తక్కువగా ఉంటుంది. బరువు నిర్వహిస్తాయి బ్లూబెర్రీ రాస్బెర్రీ, స్ట్రాబెరీ, క్రాన్ బెర్రీ ,బ్లాక్ బెర్రీస్ వంటివి. మీ స్నాక్స్ రూపంలో తీసుకోవాలి లేకపోతే యోగార్ట్‌లో కూడా వేసుకొని తీసుకుంటే మంచిది.

లెగ్యూమ్స్..
పప్పు ధాన్యాలు, బీన్స్, శనగలు వంటి ఆహారాలు కూడా మీ డైట్ లో ఉండాలి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ రెండు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇందులో మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఖనిజాలు ఐరన్ ,మెగ్నీషియం ఉంటాయి.

ఇదీ చదవండి: ఎర్ర కారం దోశ ఆంధ్ర స్టైల్ లో ఎంతో రుచిగా ఇలా తయారు చేసుకోవచ్చు..

గింజలు, విత్తనాలు..
వీటిల్లో కూడా క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. ఇందులో తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని మీ స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. బాదం, వాల్ నట్స్, పిస్తా, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, గుమ్మడి గింజలు వంటివి నానపెట్టి తీసుకుంటే మరీ మంచిది.

ఓట్ మిల్..
ఇది ఫైబర్ కు పుష్కలంగా ఉండే ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ మోతాదులో ఉంటాయి. సూచి తక్కువ ఉండటం వల్ల వీటిని మీ డైట్ లో చేర్చుకోవచ్చు.

ఇదీ చదవండి: ఉల్లిపాయరసం జుట్టుకు ఇలా పట్టిస్తే కుదుళ్ల నుంచి బలంగా.. నడుము వరకు పెరుగుతుంది..

యోగార్ట్‌..
చక్కర లేని యోగార్ట్‌ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ప్రోటీన్, క్యాల్షియం, ప్రోబయోటిక్స్ మీ శరీరానికి అందుతాయి. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. ఈ ప్లేన్ యోగా తీసుకోవడం వల్ల షుగర్ తక్కువ ఉంటుంది. అంతేకాదు గింజలు విత్తనాల్లో వీటిని కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News