Carrot Rice Recipe: ఆరోగ్యకరమైన రెసిపీల్లో క్యారెట్ రైస్ ఒకటి. దీనిని చాలా మంది ఎంతో ఇష్టపడి మరీ తింటూ ఉంటారు. ముఖ్యంగా లంచ్ బక్స్‌ల్లో దీనిని ఎక్కువగా పిల్లలకు ఇవ్వడం వల్ల అద్భుతమైన పోషకాలు అందించినవారవుతారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా బాడీని ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే గుణాలు కంటి చూపును మెరుగుపరిచేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలుగా కోసి)
కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగి)
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
కారం పొడి - 1/2 టీస్పూన్
కసూరి మేతి - 1/2 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 2-3
ఇంచుమింటులు - 1/2 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన్
బాస్మతి బియ్యం - 1 కప్పు
క్యారెట్ - 1 (తరుగు కోసి)
తయారీ విధానం:
ముందుగా ఈ క్యారెట్ రైస్‌ను తయారు చేసుకోవడానికి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీరు పోసి ఉడికించుకోవాలి. బియ్యం మృదువుగా ఉడికిన తర్వాత నీటిని వడకట్టి పక్కన రైస్‌ను పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలుతో పాటు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాల్సి ఉంటుంది.
క్యారెట్‌ను చిన్న చిన్న ముక్కలుగా లేదా తరుగు కోసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇలా తయారు చేసుకోండి:
ఈ రైస్‌ను తయారు చేయడానికి ముందుగా ఒక పాత్రలో నూనె వేసి చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వేడి నూనెలో జీలకర్ర, తరగిన అన్ని వేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి.
ఇప్పుడు అందులోనే తరిగిన వెల్లుల్లి వేసి కొద్ది సేపు వేగించుకోవాల్సి ఉంటుంది.
అన్ని బాగా వేగిన తర్వాత తరిగిన క్యారెట్ వేసి బాగా వేగించాలి.
ఇలా బాగా వేగిన తర్వాత కారం పొడి, కసూరి మేతి, ఉప్పు వేసి బాగా కలపాలి.
అందులోనే చల్లార్చిన అన్నం వేసి మరోసారి బాగా కలపాలి.
చివరగా కొత్తిమీర తరుగు వేసి అలంకరించి సర్వ్ చేయాల్సి ఉంటుంది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
చిట్కాలు:
బాస్మతి బియ్యం వాడటం వల్ల రైస్ రుచి అద్భుతంగా పెరుగుతుంది.
క్యారెట్‌కు బదులుగా బీన్స్, క్యాబేజ్ వంటి ఇతర కూరగాయలను కూడా వినియోగించవచ్చు. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.
వేగించేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని రైస్ రంగు మొత్తం మారుతుంది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.