Chocolate Day 2023: వాలెంటైన్స్ వీక్లో చాకొలేట్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..ఈరోజు ఇస్తే ఏమవుతుందంటే?

Chocolate Day History: ప్రస్తుత్తం వాలెంటెన్స్ వీక్ నడుస్తోంది, ఈరోజు చాక్లెట్ డే ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో అసలు ఈ డే ఎందుకు జరుపుకుంటారు? అనే వివరాలు మీ కోసం  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 9, 2023, 03:58 PM IST
  • ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ వీక్ వేడుకలు
  • ఈరోజు ఘనంగా చాకొలేట్ డే
  • ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
Chocolate Day 2023: వాలెంటైన్స్ వీక్లో చాకొలేట్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..ఈరోజు ఇస్తే ఏమవుతుందంటే?

Chocolate Day Significance: ప్రస్తుత్తం వాలెంటెన్స్ వీక్ నడుస్తోంది, ఈరోజు చాక్లెట్ డే ఘనంగా జరుపుకుంటున్నారు ప్రేమికులు. అయితే అసలు ఈ చాక్లెట్ డే ఎందుకు జరుపుకుంటారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి మన జీవితాలు అన్నీ చాక్లెట్ తో ముడిపడి ఉంటాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నప్పుడు ఏడ్చిన ప్రతిసారీ తల్లిదండ్రులు చాక్లెట్లు ఇవ్వడమో ఆశ చూపడమో చేసి మనల్ని ఊరడిస్తూ ఉంటారు. పుట్టిన రోజు వేడుకలు, జెండా పండుగలప్పుడు సైతం మనం చాక్లెట్లు పంచుకుంటూ ఉంటాం, ఒకరకంగా మన సంతోషాన్ని షేర్ చేసే అన్ని సంధర్భాల్లో ఈ చాక్లెట్స్ వాడేస్తూ ఉంటాం. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 9న ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

కనుగొన్నపుడు చేదు పానీయంగా ప్రారంభించబడినా ప్రసూతానికి దాన్ని తీపికి ప్రతిరూపంగా చెప్పుకుంటున్నారు. మొత్తం వాలెంటైన్స్ వీక్‌లో టేస్ట్‌బడ్స్‌కు సంబంధించిన ఏకైక రోజుగా చాక్లెట్ డేగా జరుపుకుంటున్నారు. ఒక వ్యక్తిని సంతోషపెట్టడంలో చాక్లెట్లు భారీ ప్రభావాన్ని చూపుతాయని చెబుతున్నారు. ఇక ఈ రోజు ఒకరికొకరు చాక్లెట్లు బహుమతిగా ఇస్తారు, వీటిని వయస్సు సహా లింగంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు కాబట్టి ఇవి ఎవరికైనా సంతోషాన్ని కలిగించే ఏకైక బహుమతి. ఈ రోజుల్లో వెయ్యి రకాలకు పైగా చాక్లెట్లు ఉన్నాయి కోకోతో తయారుచేసే డార్క్ చాక్లెట్లదే టాప్ ప్లేస్. డార్క్ చాక్లెట్లలో కూడా ఎన్నో రకాలున్నాయి. అయితే ఇప్పుడు మనం తింటున్న తరహా చాక్లెట్లను 1579లో స్పెయిన్ దేశ ప్రజలు తయారు చేశారు.

స్పెయిన్ దేశ ప్రజలు చేదుగా ఉండే కోకో పొడికి.. పంచదార కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోగా అదే చాక్లెట్ తయారీ ఫార్ములా అయ్యింది.  1829లో కోకో ప్రెస్‌ని తయారుచేయగా కోకో పొడి, కోకో వెన్న కలిపి గట్టిగా ఉండే చాక్లెట్ల తయారీ మొదలైంది. దీని వల్ల చాక్లెట్లు ప్రపంచవ్యాప్తంగా డెలివరీ చేసేందుకు వీలు కుదిరి భారీ సంఖ్యలో చాక్లెట్ల కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇక 1847లో మొదటి చాక్లెట్ బార్ తయారు చేయగా ఆ తర్వాత రెండేళ్లకు క్యాడ్బరీ  కంపెనీ ఇంగ్లండ్‌లో ప్రారంభమై బాక్స్ చాక్లెట్లను తయారుచేసి ప్రేమికుల రోజున అమ్మడంతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయింది.

అందుకే ఆ సంస్థ నేటికీ డార్క్ చాక్లెట్ల తయారీలో అదే నంబర్ వన్‌గా నిలుస్తోంది. చాక్లెట్లు ఆరోగ్యానికి ఎంతో మంచివని, వాటిని తినడం వలన బ్రెయిన్‌ని చురుగ్గా పనిచేసేలా చేస్తాయని డాక్టర్లు అంటున్నారు. అంతేకాదు శరీరంలోని విష వ్యర్థాలతో పోరాడే శక్తి చాక్లెట్లలోని పదార్థాలకు ఉంటుంది కాబట్టి  రోజుకో చాక్లెట్ తినవచ్చని నిపుణులు చెబుతున్నారట. అయితే ఈ చాక్లెట్లను రాత్రిళ్లు తినకపోవడం మేలు అని వాటిలో ఉన్న కెఫైన్, థియోబ్రొమైన్ బ్రెయిన్‌ని చురుగ్గా పనిచేసేలా చేయడం వల్ల రాత్రివేళ చాక్లెట్ తింటే నిద్ర సరిగా పట్టదని అందుకే ఆ సమయంలో వాటిని కాస్త దూరం పెట్టలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Valentine's Day 2023: మీరు లవ్ చేస్తున్న అమ్మాయికి ప్రపోజ్ చేయాలా? అయితే ఈ టిప్స్ పాటించండి!

Also Read: Valentine Week: ఫిబ్రవరి 7 నుంచే ప్రేమికులకు పండుగ.. 14 దాకా ఏరోజు ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  
 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News