Constipation Relief In 1 Day: ఆధుని జీవన శైలి కారణంగా చాలా మందిలో మలబద్ధకం సమస్య సాధరణమైపోయింది. అందుకే చాలా మంది తినే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఆహారంలో పీచుపదార్థాలు లేకపోవడం, తక్కువ నీరు తాగడం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, సిగరెట్ తాగడం వల్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొందరిలో ఇలాంటి సమస్యలు రావడం కారణంగా పైల్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి నివారణలు కూడా పాటించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మందులు తీసుకోవడం మానేయండి:
పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు మద్యపానానికి దూరంగా ఉండడం చాలా మంచిది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలి.
తాజాగా వండిన ఆహారాన్ని తినండి:
మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తాజాగా వండిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ ఆహారాల్లో ఉడికించిన కూరగాలు, తక్కువ మసాలాలు వాడితే శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
త్రిఫల చూర్ణం:
మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి త్రిఫల చూర్ణం చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయితే ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి రోజూ ఈ చూర్ణాన్ని రెండు పూటలు పాలలో కలుపుకుని తాగడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
వేయించిన సోపు:
వేయించిన సోపును ప్రతి రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు తగ్గడమేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?
Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి