Cucumber Eating Mistake: వేసవిలో డీహైడ్రేషన్ సమస్య రావడం సర్వసాధారణం. వేడిని నివారించడానికి..నీటితో పాటు వాటర్ కంటెంట్ అధిక పరిమాణంలో ఉండే పండ్లను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు దోసకాయలను తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం చాలా మంది దోసకాయను ఖాళీ కడుపుతో తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దోసకాయ తిన్న తర్వాత నీరు తాగొచ్చా?:
దోసకాయ తిన్న తర్వాత చాలా మంది నీటిని తాగుతున్నారు. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. కాబట్టి ఇదే క్రమంలో అతిగా నీటి తీసుకోవడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో పోషకాల పరిమాణాలు కూడా అతిగా లభియని.. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
ఖాళీ కడుపుతో దోసకాయ తినడం మంచిదేనా?:
ఖాళీ కడుపుతో దోసకాయ రసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు వేసవి కారణంగా వచ్చే హైడ్రేట్ సమస్యలను దూరం చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలో విష పదార్థాలను తొలగించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
శరీర బరువును నియంత్రిస్తుంది:
✽ ప్రస్తుతం చాలా మంది శరీర బరువును నియంత్రించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రతి రోజు దోసకాయతో చేసిన రసాన్ని తీసుకోవం వల్ల శరీరానికి ఫైబర్ లభించి బరువును నియంత్రిస్తుంది. అంతేకాకుండా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
✽ దోసకాయ రసం లేదా ముక్కలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల లూజ్ మోషన్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకున్న తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చి నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook