Krishna Tulsi Cough Syrup: కృష్ణ తులసి సిరప్‌తో 1 గంటలోనే మీ జలుబు, దగ్గు మటు మాయం!

Krishna Tulsi Cough Syrup For Dry Cough: చలి కాలంలో చాలా మంది జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా కృష్ణ తులసితో తయారు చేసిన సిరప్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ సిరప్‌ను తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.     

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2023, 04:32 PM IST
Krishna Tulsi Cough Syrup: కృష్ణ తులసి సిరప్‌తో 1 గంటలోనే మీ జలుబు, దగ్గు మటు మాయం!

 

Krishna Tulsi Cough Syrup For Dry Cough: శీతాకాలం వచ్చిందంటే చాలు వాతావరణంలో తేమ పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటాయి. దీని కారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో చాలా మందిలో శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి శీతాకాలంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శీతాకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మార్కెల్‌లో లభించే రసాయనాలతో కూడిన మందులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద చిట్కాలు పాటించడం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు. 

శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారు కృష్ణ తులసితో తయారు చేసిన కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ తులసిలో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ కృష్ణ తులసిని టీలా తయారు చేసుకుని తాగడం వల్ల దగ్గు, గొంతు నొప్పి సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో పాటు ఇది తీవ్ర దగ్గుకు సిరప్‌లా కూడా పని చేస్తుంది. కాబట్టి చలి కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తులసిని తప్పకుండా టీలా తయారు చేసి తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

కృష్ణ తులసిని ఎలా గుర్తించాలో తెలుసా?:
భాతరదేశ వ్యాప్తంగా కృష్ణ తులసిని వివిధ పేర్లతో పిలుస్తారు. కొన్ని చోట్ల ఈ తులసిని శ్యామ తులసిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తులసి అన్ని తులసి రంగుల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ మొక్క నీలి రంగుతో పాటు ఎరుపు రంగును కలిగి ఉంటుంది. అంతేకాకుండా కృష్ణ తులసి ఆకులు, పువ్వులు, గింజలు ఊదా రంగులో ఉంటాయి.

కృష్ణ తులసిని ఇలా వినియోగించండి:
కృష్ణ తులసి సిరప్ తయారు చేయడానికి ముందుగా 4 నుంచి 6 ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకులను ఒక కప్పు నీటిలో వేసి అందులోనే  2 టీస్పూన్ల తేనె, చిటికెడు పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడి వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా చేసిన తర్వాత కషాయంలా తయారయ్యాక వడకట్టుకని ఒక సీసాలో భద్రపరుచుకుంటే చాలు..ఇలా తయారు చేసిన సిరప్‌ను శీతాకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News