Top Weight Loss Tips: అధిక బరువు అనేది ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన బరువు కంటే ఎక్కువ బరువు కలిగి ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఇది శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల కలుగుతుంది. అధిక బరువు అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య, ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అధిక కేలరీలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య బారిన పడాల్సి ఉంటుంది. హైపోథైరాయిడిజం, కుషింగ్ సిండ్రోమ్ వంటి కొన్ని వైద్య పరిస్థితులు బరువు పెరగడానికి దారితీస్తాయి.కొన్ని మందులు, స్టెరాయిడ్లు మరియు యాంటీడిప్రెసెంట్లు వంటివి, దుష్ప్రభావంగా బరువు పెరగడానికి కారణమవుతాయి.
అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు నిద్రపోయే సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల సులువుగా బరువు తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముందుగా మీరు రాత్రి కనీసం సుమారు ఏడు నుంచి ఏనిమిది గంటల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది. ఆరోగ్యనిపుణులు ప్రకారం శరీరానికి తగినంత నిద్రలేని కారణంగా కూడా ఊబకాయం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలి అనుకొనేవారు శరీరానికి కావాల్సిన నిద్ర అవసరం.
రాత్రి భోజనంలో చక్కెర ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు కలిగిస్తాయి. ఆకలిని పెంచుతుంది. వీటిని తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. అంతేకాకుండా రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపరుచుతుంది. రాత్రిపూట తిన్నఆహారం జీర్ణం కావడం వల్ల ఊబకాయం సమస్యల బారిన పడాల్సిన అవసరం ఉండదు.
ప్రతిరోజు పడుకునే ముందు అధిక శాతం ఆహారం తీసుకోవడం అంత మంచిది కాదని వైద్యులు తెలుపుతున్నారు. ఇది జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తుంది. దీని వల్ల అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు ప్రోటీన్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు.
పడుకొనే ముందు కాఫీ, టీ, కెఫిన్ కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఈ పానీయాలకు బదులుగా హెర్భల్ టీ, గ్రీన్ టీ, పసుపు పాలు తీసుకోవడం చాలా మంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రోజంతా శరీరంలో నిల్వ ఉన్న కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే మంచి నిద్ర కలుగుతుంది. అదునపు కొవ్వును పోగొట్టుకోవడానికి రాత్రిపూట నడవడం మంచి మార్గం అని వైద్యనిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట తీసుకోవాల్సిన ఆహార ఎంపికలు:
సూప్: కూరగాయల సూప్ లేదా పప్పు సూప్ వంటి సూప్ ఒక తేలికపాటి సంతృప్తికరమైన భోజనం.
సలాడ్: ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుళ్ళు లేదా చేపలతో కూడిన సలాడ్ ఒక ఆరోగ్యకరమైన రిఫ్రెష్ ఎంపిక.
ఓట్స్: ఓట్స్ ఒక పోషకమైన జీర్ణం చేయడానికి సులభమైన ధాన్యం. వాటిని పాలు లేదా నీటిలో ఉడికించి, పండ్లు, గింజలు లేదా గుడ్డుతో టాపింగ్ చేయవచ్చు.
పెరుగు: పెరుగు ఒక మంచి ప్రోబయోటిక్ ఆహారం, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. దానిని పండ్లు, గింజలు లేదా తేనెతో టాపింగ్ చేయవచ్చు.
గుడ్లు: గుడ్లు ఒక బహుముఖ ఆహారం, వీటిని వివిధ రకాలుగా ఉడికించి తినవచ్చు. అవి ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి మూలం.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి