Side Effects Of Drinking Tea In Paper Cups: ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడి, అలసట కారణంగా చాలా మంది టీ, కాఫీలకు అలవాటు పడుతున్నారు. టీ, కాఫీ తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే ఇంట్లో మనం గాజు గ్లాసు, పింగాణీ కప్పు వంటి వాటిలో కాఫీ, టీ తాగుతాము. కానీ అదే మనం బయట టీ తాగాలి అంటే మనకు పేపర్ కప్‌లో దొరుకుతుంది. ఈ పేపర్ కఫ్లో మనం టీ, కాఫీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Also Read: Constable Exam: నిరుద్యోగులకు అలర్ట్.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్ష రద్దు
మనం అందరం పేపర్ కప్ అంటే పూర్తి పేపర్‌తో తయారు అవుతుందని అనుకుంటాము. కానీ ఇది పేపర్‌తోనే కాకుండా ప్లాస్టిక్‌తో పాటు తయారు అవుతుందని కొన్ని పరిశోధనలో తేలింది. తాజాగా పేపర్ కప్పులపై ఐఐటీ ఖరగ్‌పూర్ వారు పరిశోధన చేశారు. కప్స్‌లో వేడివేడి టీ, కాఫీ, పాలు పోసిన 15 నిమిషాల తర్వాత 25 వేల మైక్రాన్ సైజు పార్టికల్స్ టీ లేదా కాఫీలో కలుస్తున్నట్లు గుర్తించారు. అయాన్స్, టాక్సిక్ హెవీ మెటల్స్ ఇందులో కలిసిపోతాయి.దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
పేపర్ కప్‌లో టీ తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు:
1. ప్లాస్టిక్ పొర:
పేపర్ కప్పులలో లోపల ఒక ప్లాస్టిక్ పొర ఉంటుంది. ఈ ప్లాస్టిక్ పొర వేడి టీ వల్ల కరిగి, మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత, జీర్ణ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
2. రసాయనాలు:
కొన్ని పేపర్ కప్పులలో బ్లీచ్, ఫ్లోరోసెంట్ రంగులు, పాలిథిలిన్ వంటి హానికర రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు కూడా మన శరీరంలోకి ప్రవేశించి, అనారోగ్యానికి కారణమవుతాయి.
3. బ్యాక్టీరియా:
పేపర్ కప్పులు చాలా సులభంగా బ్యాక్టీరియాకు నిలయంగా మారతాయి. ముఖ్యంగా తడిసిన తర్వాత ఈ బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ఈ బ్యాక్టీరియా వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి.
4. వేడిని తట్టుకోలేకపోవడం:
పేపర్ కప్పులు వేడిని తట్టుకోలేవు. వేడి టీ పోసిన తర్వాత కప్పు మెత్తబడి, చిట్లడం మొదలవుతుంది. ఈ చిన్న చిన్న ముక్కలు మన టీలో కలిసి, మనం తాగేటప్పుడు గొంతులోకి వెళ్ళే అవకాశం ఉంది.
5. పర్యావరణానికి హాని:
పేపర్ కప్పులు పర్యావరణానికి చాలా హానికరం. వీటిని తయారు చేయడానికి చాలా చెట్లను నరకాలి. అంతేకాకుండా వీటిని పారవేయడం కూడా చాలా కష్టం.
పేపర్ కప్పులకు బదులుగా మనం మట్టి కప్పులు, స్టెయిన్లెస్ స్టీల్ కప్పులు, గాజు కప్పులు వంటి ఆరోగ్యానికి మంచివి, పర్యావరణానికి హాని కలిగించని కప్పులను ఉపయోగించడం మంచిది.
Also read: BP Warnings and Signs: రాత్రి వేళ నిద్రించేటప్పుడు బీపీ పెరిగితే ప్రాణాలు పోతాయా, ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook