Egg Paratha Recipe: ఎగ్ పరాటా తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. గా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు:
ఒకటిన్నర కప్పు గోధుమపిండి, ఉప్పు, నూనె, చిన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఉడికించిన కోడిగుడ్లు, పసుపు, కారం, తరిగిన కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, మయోనీస్
ఎగ్ పరాటా తయారీ విధానం:
ఒక గిన్నెలో చపాతీ పిండి తీసుకోవాలి. ఇందులోకి ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు స్టఫింగ్ తయారీకి కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను తురిమి తీసుకోవాలి. ఇందులో వేయించిన ఉల్లిపాయలను, అలాగే మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలపాలి. కలిపిన పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి చపాతీలా వత్తుకోవాలి.
Also read: Vegetables For Diabetes: ఈ ఆకులు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధికి చెక్!
ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ ను ఉంచి అంచులను మూసి వేయాలి. తరువాత పరోటాలా వత్తుకోవాలి. ఇలా పరాటాను తయారు చేసుకున్న దీనిని వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె లేదా బటర్ వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పరాటా తయారవుతుంది.
Also read: Rich Foods For Hair: ఒత్తైన జుట్టు కోసం ఇవి తప్పక తినండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter