Face Beauty Tips In Telugu: ప్రతి ఒక్కరూ ముఖం సౌందర్యంగా ఉండాలని కోరుకుంటారు. ఫేస్ అందంగా ఉండడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది. అయితే ముఖం అందంగా కనిపించడానికి శరీరం హైడ్రేట్‌గా ఉండాలి. లేకపోతే చర్మ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికమని చర్మ సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మందికి ముఖంపై మెరుపును కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది. అయితే ఇదే క్రమంలో చాలా మంది చర్మ, ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఖరీదైన ఉత్పత్తులను వాడుతున్నారు. కానీ ఇవి ఎలాంటి ప్రభావం చూప లేకపోతున్నాయి. అయితే ముఖ, చర్మ సౌందర్యం కోసం పలు రకాల సహజ పద్ధతులను అనుసరించడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇవి చర్మ సౌందర్యన్ని పెంచుతాయి(increase the beauty of skin):
1. పెరుగు(curd)
పెరుగును ఆహారల రుచిని పెంచేందుకు వినియోగిస్తారు. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. అయితే ఈ పెరుగును ముఖ, చర్మ సౌందర్యం కోసం వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇది చర్మంపై తేమను పెంచేందుకు కృషి చేయడమే కాకుండా.. ముఖంపై చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా చర్మంపై నలుపును కూడా తొలగిస్తుంది. అయితే దీని కోసం మొదటగా పెరుగును తీసుకుని.. రాత్రిపూట పెరుగును ముఖానికి అప్లై చేసి, 20 తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై నలుపు తగ్గిపోవడమే కాకుండా.. చర్మం సౌందర్యంగా కనిపిస్తుంది.
2. రోజ్ వాటర్(Rose water)
రోజ్ వాటర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతి వంతంగా చేసేందుకు కృషి చేస్తుంది. ఈ రోజ్ వాటర్‌తో రాత్రి పూట రోజూ ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై చర్మం పొడిబారకుండా ఉంటుంది. అంతేకాకుండా చర్మం నున్నగా తయారవుతుంది.
3. ముల్తానీ మిట్టి(Multani mitti)
శతాబ్దాల నుంచి ముల్తానీ మిట్టి చర్మ సౌందర్యం పెంచేందుకు వినియోగిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరుగు పరచడమే కాకుండా కాంతివంతంగా చేస్తాయి. ఈ మట్టిలో రోజ్‌వాటర్ మిక్స్ చేసి కళ్ల కింద నల్లని వలయాలు ఉన్న చోట అప్లై చేయడం వల్ల త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారని చర్మ సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ముఖంపై మొటిమలను కూడా నియంత్రింస్తుంది. దీని కోసం ముల్తానీ మిట్టిని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. దీనిని రోజూ ముఖానికి అప్లై చేయండి. ముఖానికి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Read also: Cherries For Weight Loss: ఏం చేసిన బరువు తగ్గడం లేదా.. అయితే రోజూ వీటిని తినండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook