Fever Remedies At Home: చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు రావడం సర్వసాధరణం. అయితే చాలా మంది అధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల సులభంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చలి కాలంలో తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడితే తప్పకుండా పలు ఆయుర్వేద మూలికలతో కలిగిన ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
సీజనల్ వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా వీటిని తీసుకోండి:
పుదీనా ఆకులు:
పుదీనా ఆకుల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే వీటిని ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ ఆకులతో పాటు నల్ల ఉప్పును వినియోగిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులు:
తులసి ఆకుల్లో అంటు వ్యాధులను దూరం చేసే అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి వీటితో తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.
ఆకుకూరలు:
సెలెరీ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు వ్యాధులను దూరం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ ఆకులను నీళ్లతో మరిగించి తాగితే.. రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.
మునగ ఆకులు:
మునగ ఆకుతో తయారు చేసిన వంటకాలను ప్రతి రోజూ తింటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీంలో రోగనిరోధక శక్తి పెంచి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Sunny Leone: సన్నీ లియోన్ పెదవికి గాయం!.. కావడానికి ఇదే కారణమా..?
Also Read: Sunny Leone: సన్నీ లియోన్ పెదవికి గాయం!.. కావడానికి ఇదే కారణమా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook