Flight Safety Rules: ఆకస్మిక ప్రయాణాలు లేదా టైమ్ సేవింగ్ కోసం విమాన ప్రయాణాలు చేస్తుంటాం. అయితే విమాన ప్రయాణంలో పొరపాటున కూడా విమాన సిబ్బందితో అనకూడని లేదా చెప్పకూడని నాలుగు ముఖ్య విషయాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.. ఎందుకంటే ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే మీపేరు బ్లాక్‌లిస్ట్‌లో ఎక్కేస్తుంది.
ఫ్లైట్ సేఫ్టీ రూల్స్ ప్రకారం విమాన ప్రయాణంలో పాటించాల్సిన కొన్ని విధి విధానాలుంటాయి. కొన్ని రకాల పదాల ప్రయోగం లేదా మాట్లాడటం తీవ్రంగా పరిగణిస్తుంటారు. ఒకవేళ సరదాకు మీరు ఆ పదాల్ని ఉచ్ఛరిస్తే లేదా మాట్లాడితే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని ఫ్లైట్ సిబ్బంది కరాఖండీగా చెప్పేస్తారు. అలా చేస్తే లక్షలాది రూపాయలు జరిమానాతో పాటు మూడేళ్ల వరకూ జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. దాంతోపాటు శాశ్వతంగా విమాన ప్రయాణం చేయకుండా బ్లాక్‌లిస్ట్ అవుతారు.
డైలీ స్టార్ రిపోర్ట్ ప్రకారం ఫ్లైట్‌లో విమాన సిబ్బందిని రిక్వెస్ట్ చేసి మద్యం తాగవచ్చు. కానీ ముందే మందు తాగి విమానంలో ఎక్కకూడదు. అలా చేస్తే ఎయిర్‌లైన్స్(Airlines) తీవ్రంగా పరిగణిస్తుంది. ఒకవేళ మీరు సరదాకైనా సరే నేను మందు తాగి ఉన్నానని విమాన సిబ్బందితో చెబితే..కష్టాల్లో పడిపోతారు. మద్యం మత్తులో ఉండే ప్రయాణీకులు ఇతర ప్రయాణీకుల భద్రతకు ప్రమాదకరంగా మారుతారు. ఇలాంటి మందుబాబుల్ని నియంత్రించేందుకు ఫ్లైట్ సిబ్బంది, కేబిన్ క్రూకు ప్రత్యేక అధికారాలున్నాయి. మద్యం మత్తులో ఉన్న ప్రయాణీకులు ఎక్కకుండా నియంత్రించగలరు. ఒకవేళ విమాన ప్రయాణంలో మీరు మద్యం తాగి ఉన్నారని తెలిస్తే..సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌లో (Airport) సదరు ప్రయాణీకుడిని దింపేయవచ్చు.
అంతేకాదు..మద్యం మత్తులో ఉన్న ప్రయాణీకులు విమాన సిబ్బందితో వాదన లేదా ఘర్షణకు దిగితే వారిపై కేసు కూడా నమోదు చేయవచ్చు. అలా దోషిగా తేలితే 8 వేల పౌండ్ల జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష కూడా విధించవచ్చు. దాంతోపాటు ఆ ప్రయాణీకుడిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేస్తారు. మీరు ఎప్పుడు ఫ్లైట్‌లో ఉన్నా సరే...Iam Drunk అని లేదా నేను మత్తులో ఉన్నానని చెప్పకూడదు. మీరు చేసే ఈ సరదాను ఫ్లైట్ సిబ్బంది తీవ్రంగా పరిగణిస్తారు. మిమ్మల్ని సమీపంలోని ఏదో ఒక విమానాశ్రయంలో దింపేయవచ్చు. ఇతర ప్రయాణీకుల ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టారనే కేసు పెట్టవచ్చు. శాశ్వతంగా విమానం ఎక్కకుండా చేయవచ్చు.
Also read: Republic Day 2022: జాతీయ జెండాలోని మూడు రంగుల డ్రెస్సింగ్ స్టైల్‌తో స్ఫూర్తినిస్తున్న సెలెబ్రిటీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook