Food And Drink To Clean Intestine Naturally: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది స్ట్రీట్ ఫుడ్‌ను విచ్చల విడిగా తింటున్నారు. అయితే వీటిలో చాలా వరకు పంచదార, మైదా, ఉప్పుతో చేసిన ఆహారాలే ఉంటున్నాయి. అయితే వీటిని తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటిని అధిక పరిమాణంలో తీసుకుంటే పేగుల్లో రకరకాల టాక్సిన్స్ పేరుకుపోయి ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడానికి పలు రకాల డ్రింక్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడానికి ఇలా చేయండి:
పుష్కలంగా నీరు తాగండి:
శరీరం హైడ్రేటెడ్ గా ఉండడానికి పలు రకాల ఆరోగ్యమైన డ్రింక్స్‌తో పాటు నీటిని అధిక పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది. నీటిని అధిక పరిమాణంలో తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆహారాల్లో టమోటాలు, ఆకుకూరలు, పండ్లు అధిక పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది.
ఉప్పునీరు తాగండి:
పొట్టలో ప్రేగులను శుభ్రం కావడానికి మీరు తప్పకుండా ఉప్పునీరు తాగాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా ఉప్పును నీరును తాగితే పొట్ట సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరానికి కావాల్సి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగిస్తే బరువు తగ్గడమేకాకుండా పొట్టలో ప్రేగులు శుభ్రమవుతాయి. అంతేకాకుండా ఇందులో చెడు బ్యాక్టీరియాను చంపే ఎంజైములు, యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి మీరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడితే ఆహారంలో తీసుకోవచ్చు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook