Acidity Homemade Remedy: చాలా మంది ఎసిడిటి సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎసిడిటీ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కడుపులో , ప్రేగులల్లో అల్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను వాడడం వల్ల మనం ఎసిడిటీ సమస్యను సహజ సిద్దంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా వాడడం వల్ల ఎసిడిటీ సమస్యను మనం శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు.
ఎసిడిటీ సమస్యను తగ్గించే చిట్కాలు ఇవే...
దీనిని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ నీటిలో కాచీ చల్లర్చిన పాలు, ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలిపి తాగాలి. ఎసిడిటీ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు దీని తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు భోజనం చేసిన తరువాత ఈ చిట్కాను ఉపయోగించడం కారణంగా మంచి ఫలితం పొందుతారు.
Also read:Dry Itchy Skin: చలి కారణంగా చర్మం పొడిగా తయారవుతోందా? ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా చెక్ పెట్టొచ్చు..
జీలకర్ర వల్ల త్వరగా ఉపశమనం పొందండి..
దీని కోసం పసుపును, జీలకర్ర, నిమ్మకాయ, నల్ల ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా జీలకర్రను వేయించి పొడిగా చేసుకోవాలి. ఒక గిన్నెలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు వేసి కలపాలి. తరువాత మంటపై చెప్పిన పదార్థాలను వేడి చేయాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని వెంటనే తాగాలి. ఇలా రోజు వాడడం వల్ల ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే ఎసిడిటీ సమస్యతో బాధపడే వారు మజ్జిగను తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో మజ్జిగ ఎంతో సహాయపడుతుంది. మజ్జిగను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎసిడిటీ , కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు పూర్తిగా తగ్గు ముఖం పడతాయి. చిట్కాలను క్రమం తప్పకుండా వాడడం వల్ల ఎసిడిటీ సమస్య పూర్తిగా తగ్గడంతో పాటు మళ్లీ రాకుండా కూడా ఉంటుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి