Grapefruit For Weight Loss: వేసవిలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే వాతావరణంలో వివిధ రకాల మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సీజన్‌లో శరీరాన్ని హైడ్రేట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేక పోతే చర్మ సమస్యలు, ప్రాణాంతక వ్యాధులు రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కోసం పలు రకాల పండ్లను తీసు కోవాలని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
గ్రేప్‌ఫ్రూట్‌లో లభించే పోషకాలు:
గ్రేప్‌ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇవేకాకుండా ఇందులో ఐరన్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, మినరల్స్ వంటి పోషకాలు దబ్బపండు(Grapefruit)లో ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
దబ్బపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. బరువు తగ్గండి:
మారుతున్న జీవన శైలికి కారణంగా ఊబకాయం తగ్గడం సమస్యగా మారుతుంది. ప్రస్తుతం దీని కోసం వ్యాయామాలు చేస్తున్నారు. కానీ దబ్బపండు(Grapefruit)ను వినియోగించడం వల్ల వేగంగా బరువును తగ్గిస్తుంది.
2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
కరోనావైరస్ మహమ్మారి తరువాత.. చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గి పోయింది. దీని కోసం విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్న పండ్లను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ దబ్బపండులో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
3. డీహైడ్రేషన్:
వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం సర్వసాధారణం. ఈ పండులో 90 శాతం వరకు నీటి శాతం ఉన్నందున వీటిని వినియోగించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందగలుగుతారు.
4. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
వేసవి కాలంలో పొట్టలో చాలా రకాల జీర్ణం సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అజీర్ణం వంటి సమస్య ఉత్పన్నమవుతాయి. ఇలాంటి సమయంలో దబ్బపండు(Grapefruit)ను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల పొట్టలో ఎసిడిటీ, గ్యాస్ ఫ్రాస్ట్ సమస్యలు దూరమవుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Male Fertility: పాలలో ఇది కలిపి తాగితే పురుషులలో స్పెర్మ్ కౌంట్ ఘనీయంగా పెరుగుతుంది..!
Also Read: Male Fertility: పెళ్లైన మగవారు పచ్చళ్లు తినడం మానుకోవాలి? లేకపోతే సంతానోత్పత్తిపై ప్రభావం తప్పదు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook