Hair Fall Control Oil: ప్రతి ఒక్కరూ తమ జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు. నల్లగా మెరిసే జుట్టు పొందడానికి ఒక్కొక్కరూ ఒక్కొక్క నూనెను వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరగడం కారణంగా జుట్టు బలహీనంగా మారుతోంది. అంతేకాకుండా కొందరిలో నిర్జీవంగా కూడా తయారవుతోంది. దీని కారణంగా చాలా మందిలో సులభంగా జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు జుట్టుకు ఉల్లిపాయ నూనెను వినియోగించాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఉల్లిపాయ నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టును బలోపేతం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా నల్లగా మెరిసేలా తయారు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా సమస్యలున్నవారికి కూడా ఉల్లిపాయ నూనె ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.
ఉల్లిపాయ నూనె తయారి విధానం:
ఉల్లిపాయ నూనెను తయారు చేయడానికి..మూడు ఉల్లిపాయను తీసుకుని ముక్కలు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఓ పాన్‌లో వేసుకి, వేడి చేసుకోవాలి. అయితే ఇందులోనే ఆలివ్ నూనెను వేసుకుని తక్కువ మంటపై మరిగించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత నూనెను వడకట్టుకుని సీసాలో భద్రపరుచుకోవాలి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
జుట్టుకు రాసుకునే విధానం:
ఉల్లిపాయలతో తయారు చేసిన నూనె జుట్టుకు రాసుకోవడానికి ముందు తప్పకుండా జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నూనెను తీసుకుని జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇలా ప్రతి రోజు జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టు రాలడంతో పాటు తెల్ల జుట్టు సమస్యలు సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనిని వినియోగించాలనుకునేవారు ప్రతి రోజు ఉదయాన్ని తల స్నానాకి గంట ముందు కూడా వినియోగించవచ్చు.
మసాజ్:
జుట్టుకు ఈ ఉల్లిపాయ నూనె రాసుకున్న తర్వాత వేళ్ల సహాయంతో సున్నితంగా మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ వేగంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు బలోపేతమవుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి