Hair Fall Solution: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే జుట్టు రాలడం వంటి సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లి వయసుకు వచ్చే సరికి జుట్టు పూర్తిగా రాలిపోయి బట్టతలగా మారిపోతోంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్ లభించే చాలా రకాల ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. అయితే వీటికి బదులుగా ఆయుర్వేద గుణాలు కలిగిన హెయిర్ మాస్క్‌ను వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు మెంతి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు:
మెంతి గింజల్లో విటమిన్ సి, ప్రొటీన్, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా మెంతి గింజల హెయిర్ మాస్క్‌ను వినియోగించడం వల్ల చుండ్రు సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా మెరిసే, అందంగా జుట్టు తయారవుతుంది.
హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి?
ఈ హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయడానికి... 2 టేబుల్ స్పూన్లు మెంతి గింజలు, 2 గుడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయం గ్రైండ్ చేసి పేస్ట్‌ను సిద్ధం చేయండి. ఇప్పుడు దానితో 2 గుడ్లు కలపండి. అంతే సులభంగా మెంతులు గింజలతో తయారు చేసిన హెయిర్ మాస్క్ తయారైనట్లే..
మెంతి గింజల హెయిర్ మాస్క్‌ను వినియోగించే విధానం:
మెంతి గింజల హెయిర్ మాస్క్‌ని అప్లై చేయడానికి ముందుగా జుట్టును పూర్తిగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా జుట్టును మంచిగా తుడ్వాల్సి ఉంటుంది. అయితే హెయిర్ మాస్క్‌ను ఫైన్‌గా జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. జుట్టుకు పట్టించి సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. చివరగా జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, నిపుణుల సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Investment Tips: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి
Also Read: Kane Williamson: అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు.. కానీ వెంటాడిన దురదృష్టం.. సీజన్ మొత్తానికి దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి