White Hair Solution: ఇలా కరివేపాకుతో కూడా జుట్టు సమస్యలకు 7 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Hair Mask For Silky And Shiny Hair: జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే కరివేపాకు హెయిర్‌ మాస్క్‌ను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జుట్టు అన్ని సమస్యలు తగ్గుతాయి. ఈ మాస్క్‌ను వినియోగించే ముందు ఇలా చేయండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 05:59 PM IST
  • జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారా..
  • అయితే కరివేపాకు హెయిర్‌ మాస్క్‌ను వాడండి
  • ఇలా చేస్తే జుట్టు సమస్యలకు 7 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు
White Hair Solution: ఇలా కరివేపాకుతో కూడా జుట్టు సమస్యలకు 7 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Hair Mask For Silky And Shiny Hair: వాతావరణంలో మార్పులు సంభవించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమస్యలు ఉత్పన్నం కావడానికి ప్రధాన కారణాలు జంక్ ఫుడ్ తినడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి ఫుడ్‌ తీసుకోవడం వల్ల చాలా మందిలో జుట్టు రాలడం సహజం, జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా చిన్న వయసుల్లోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల చిట్కాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
 
జుట్టు సమస్యల నుంచి ప్రభావవంతంగా పోరాడడానికి కరివేపా ప్రభావవంతంగా కృషి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.  కరివేపాకు జుట్టు నెరసిపోకుండా చేసి జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టులోని మెలనిన్ లోపాన్ని కూడా తొలగించేందుకు కృషి చేస్తుంది.  కరివేపాకును జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ మృదువుగా మారుతుంది.

కరివేపాకును హెయిర్‌ మాస్క్‌గా కూడా వినియోగించవచ్చని, దీని కోసం కరివేపాకు, కొబ్బరి నూనె, వేప ఆకులు, విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకుని వాటిని అన్నిటినీ మిక్స్‌ చేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల సులభంగా జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని సులభంగా తగ్గిస్తుంది.

ఈ హెయిర్ మాస్క్‌ను వినియోగించే ముందు తప్పకుండా జుట్టును శుభ్రం చేసి సరిగ్గా ఆరనివ్వాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక గంట తర్వాత జుట్టును కడగాలి. ఈ హోం రెమెడీని వారానికి రెండు సార్లు అప్లై చేస్తే సులభంగా అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

Also Read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News