Happy Holika Dahan Wishes:హోలీ శుభాకాంక్షలు కలర్ ఫుల్ గా చెప్పేయండిలా!

Holika Wishes In Telugu 2023: మీ ప్రియమైన వారిని మరింత దగ్గర చేసేందుకు, వాట్సాప్ ద్వారా ఈ మెసేజులు పంపపి హోలీ సందర్భంగా వారిని ఆనందపరచండి.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 7, 2023, 03:24 PM IST
Happy Holika Dahan Wishes:హోలీ శుభాకాంక్షలు కలర్ ఫుల్ గా చెప్పేయండిలా!

Holi Wishes In Telugu: హోలీ' అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగనుహోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా వివిధ ప్రాంతాలలో పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ గురించి పురాణాల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నా ముఖ్యంగా భక్త ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగానే ఈ హోళీ జరుపుతూ ఉంటారు. ఈ రంగుల పండుగ సందర్భంగా మీరు ఇంటికి దూరంగా ఉంటే, మీ ప్రియమైన వారిని మరింత దగ్గర చేసేందుకు, Whatsapp ద్వారా ఈ మెసేజులు పంపపి హోలీ సందర్భంగా వారిని ఆనందపరచండి.
 

వసంత గమనంలో వచ్చెను రంగుల హోలీ
నింపెను మన జీవితాల్లో సంతోష కేళీ
మీకు- మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

రంగుల పండుగ వచ్చింది
అందరికీ ఆనందాన్ని తెచ్చింది
హ్యాపీ హోలీ

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ హోలీ
అందరికీ హోలీ శుభాకాంక్షలు.
సుఖ-దుఃఖాలు, సంతోషాలకు ప్రతీకే ఈ రంగుల హోలీ పండుగ
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

హోలీ రంగుల కేళీ
మీ జీవితంలో నిండాలి రంగోలి
- మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

రంగులన్నీ వేరుగా కనిపించవచ్చు
కానీ, అన్నీ కలిసి ఉంటేనే కంటికి ఇంపు
- మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.

ఆ నింగిలోని హరివిల్లు మీ ఇంట విరియాలి
ఆ ఆనందపు రంగులు మీ జీవితంలో నిండాలి
- మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం
అన్ని మతాలు కలిసి ఉంటేనే దేశానికి అందం.. ఆనందం
- మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

హోలీ నింపాలి మన జీవితాల్లో ఆనంద పరిమళం
తేవాలి సుఖ శాంతి సౌభాగ్యాలు
- మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

ఈ రంగుల హోలీతో మీ జీవితం
సంబరాలమయం కావాలని ఆశిస్తూ హ్యాపీ హోలీ

హరివిల్లులోని రంగులన్నీ నేలకు దించేద్దాం
అందరితో కలిసి ఆనందంగా ఆటలాడేద్దాం
రసాయనాలు వద్దే వద్దు మనకొద్దు.. ప్రకృతిసిద్ధ రంగులే ముద్దు
ఈ హోలీని సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ
- మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

Also Read: Holi 2023 Skincare Tips: హోలీ పండగ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Also Read: Skin Care Tips: ముఖం కాంతి విహీనంగా, చర్మం నిర్జీవంగా మారిందా, ఏం చేయాలి, ఏం తీసుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 
 

Trending News