Holi 2023 Skincare Tips: హోలీ పండగ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Skincare and haircare tips on Holi : రంగులు చల్లుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. ఇబ్బందులు తప్పవు అంటున్నారు. చర్మ సంబంధిత వ్యాధి నిపుణులు. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో ప్రముఖ డెర్మటాలజిస్ట్, డెర్మటోసర్జన్‌గా సేవలు అందిస్తున్న డా రోహిత్ బాత్రా జీ మీడియాతో మాట్లాడుతూ.. హోలి రంగుల నుంచి హానీ లేకుండా ఉండటం కోసం పలు సలహాలు, సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. 

Written by - Pavan | Last Updated : Mar 6, 2023, 07:04 PM IST
Holi 2023 Skincare Tips: హోలీ పండగ వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Skincare and haircare tips on Holi : హోలీ పండగ అంటేనే సంబరాల కేళి. అలయ్ బలయ్ చెప్పుకుని ఒకరినొకరు అలుముకుంటూ, రంగులు పులుముకుంటూ చేసుకునే ఈ పండగలో పాల్గొనని వారు ఉండరేమో. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు.. అన్ని వయస్సుల వారు తమ వయస్సును, అన్ని చింతలను మర్చిపోయి సరదాగా రంగులు చల్లుకుంటూ ఆడుకునే ఈ పండగ అంతే ఇష్టపడని వాళ్లుండరు.  

అయితే, రంగులు చల్లుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. ఇబ్బందులు తప్పవు అంటున్నారు. చర్మ సంబంధిత వ్యాధి నిపుణులు. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో ప్రముఖ డెర్మటాలజిస్ట్, డెర్మటోసర్జన్‌గా సేవలు అందిస్తున్న డా రోహిత్ బాత్రా జీ మీడియాతో మాట్లాడుతూ.. హోలి రంగుల నుంచి హానీ లేకుండా ఉండటం కోసం పలు సలహాలు, సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

హోలి ఆడటానికంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హోలీ ఆడటాని కంటే ముందుగా ముఖానికి, చేతులకు, కాళ్లకు ఆయిల్ లేదా ఏదైనా మాయిశ్చరైజర్ లోషన్ రుద్దుకున్నట్టయితే.. హోలీ ఆడిన తరువాత రంగులు సులభంగా, శుభ్రంగా కడిగేసుకోవడానికి వీలు ఉంటుంది. అంతేకాకుండా మీ జుట్టుకు కూడా ఆయిల్ అప్లై చేయండి. అలా చేయడం వల్ల మీ జుట్టుకు ఎవరైనా హానికరమైన రంగులు, డై రుద్దినప్పటికీ.. వాటి నుంచి సులువుగా శుభ్రం చేసుకోవడానికి వీలు ఉంటుంది.

గోర్లు, పెదాలు
గోర్లకు నెయిల్ పెయింట్ లేదా వాజిలిన్ అప్లై చేయాలి. అలాగే పెదాలకు లిప్ కేర్ బామ్ కానీ లేదా వ్యాజిలిన్ కానీ అప్లై చేయొచ్చు.

వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ లోషన్
శరీరానికి వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయడం వల్ల రంగుల దుష్ర్పభావం శరీరంపై పడకుండా ఉంటుంది. కొన్ని రంగుల్లో కెమికల్స్ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల అవి శరీరానికి హానీ చేసే ప్రమాదం ఉంటుంది. కానీ ఇలా వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయడం వల్ల ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు.

ఎలాంటి దుస్తులు ఎంపిక చేసుకోవాలంటే..
శరీరం పూర్తిగా కవర్ చేసేలా ఉండే దుస్తులను ఎంచుకున్నట్టయితే.. కలర్స్ ప్రభావం శరీరంపై నేరుగా శరీరంపై కాకుండా మీ దుస్తులపైనే ఉంటాయి. అలా హానికరమైన కెమికల్ కలర్స్ నుంచి కొంత చర్మ సంరక్షణ విషయంలో కొంత ఉపశమనం పొందొచ్చు.

ఇది కూడా చదవండి : Whiteheads: వైట్‌హెడ్స్ సమస్య బాధిస్తోందా, ఈ చిట్కాలతో సులభంగా తొలగించుకోవచ్చు

ఇది కూడా చదవండి : Weight Gain Tips: ఈ పాలు రాత్రి పూట తాగితే జిమ్‌ చేయకుండానే బాడీ పెరగడం ఖాయం, నమ్మట్లేదా? ఒక్కసారి ట్రై చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News