Weirdest Foods: ఈ ప్రాంతంలో జంతువుల్ని బతికుండగానే లొట్టలు వేసుకొని తింటారు

Unusual Food Videos: మనలో చాలా మంది చికెన్ ,మటన్‌, చేపలు, రొయ్యలను ఎంతో ఇష్టంగా తింటారు. వీటితో తయారు చేసిన వంటకాలను లొట్టలేసుకొని లాగించేస్తాం. అయితే మీరు ఎప్పుడైన జంతువుల్ని బతికుండగానే తినడం మీరు చూశారా?     

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2024, 12:54 PM IST
Weirdest Foods: ఈ ప్రాంతంలో జంతువుల్ని బతికుండగానే లొట్టలు వేసుకొని తింటారు

Unusual Food Videos: సాధారణంగా మనం చికెన్‌ , మటన్‌, చేపలు, రొయ్యలను రుచికరంగా తయారు చేసుకొని కుమ్మేస్తాం. మనం తీసుకొనే ఎలాంటి ఆహారపదార్థాలైన వాటిని శుభ్రం చేసిన వాటికి కావాల్సిన పదార్ధాలను తయారు చేసుకొని ఘుమఘుమలు వచ్చేలా వండుకుంటాము. అయితే మీరు ఎప్పుడైన బతికుండగానే మాంసాహారం వంటలను తిన్నారా? అంటి షాక్‌ అవుతున్నారా కానీ ఇది నిజమం. కొన్ని దేశాల్లో కొందరు జంతువుల్ని బతికుండగానే తింటారు. 

మనదేశంలో వీటిని తినరు కానీ ఇలాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా చైనా, జపాన్ వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా లాగిస్తుంటారు. ముఖ్యంగా చిన్న కప్పల్ని బతికి ఉండగానే తింటారు. దీని చైనాలో సాన్ జీ ఎర్ అని జపాన్ లో లైవ్ ఫ్రాగ్ సాషిమి అనే పేరుతో కూడిన వంటకాలు.  వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని వారు భావిస్తారు. 

వీటితో పాటు మరి కొన్ని వంటకాలను కూడా తింటారు అవి ఇవే: 

ఆక్టో పస్:

చైనా, జపాన్‌లో ఆక్టోపస్‌లను ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సముద్ర తీరంలో లభించే చిన్న ఆక్టోపస్‌లను బతికి  ఉండగానే తింటారు. దీనిలో అధిక శాతం కాల్షియం లభిస్తుంది. కాల్షియం శరీరానికి ఎంతో అవసరం కాబట్టి దీని వారు ఇష్టంగా తింటారు. 

కోతి మెదడు:

కోతి మెదడును ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ఆహారంగా వండుకొని తింటారు. కోతి బతికి ఉన్నప్పుడు దాని తలను  పగలగొట్టి అందులో ఉండే మెదడును ఆహారంగా తింటారు. ఇవి ఎక్కువగా ఆటవిక జాతులు తీసుకొనే ఆహారం అని తెలుస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News