Health Benefits Of Bay Leaf In Telugu: బే ఆకులు బిర్యానీ రుచిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే భారతీయులు దీనిని ఆహార పదార్థాల్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది దీనిని మసాలా తయారీలో కూడా వినియోగిస్తారు. ఇందులో ఉండే గుణాలు నోటికి రుచిని అందించడమే కాకుండా శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ బే ఆకుల్లో లభించే కాల్షియం, పొటాషియం, రాగి, జింక్, ఐరన్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-క్యాన్సర్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో అధిక మోతాదులో లభించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇన్ఫెక్షన్లు, వాపుల నుంచి కూడా సులభంగా విముక్తి కలిగిస్తాయి. అలాగే వాపులతో పాటు అధిక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ బే ఆకులను ఎలా వినియోగించాలో, దీని వల్ల శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బే ఆకుల ప్రయోజనాలు:
డయాబెటిస్ ఉన్నవారికి..
డయాబెటిస్తో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేవారిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా మధుమేహం తీవ్ర తరమయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా కొంతమందిలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు బే ఆకులలో తయారు చేసిన టీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించి, కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
జీర్ణక్రియ సమస్యలకు చెక్!
బే ఆకులతో తయారు చేసిన టీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇందులో లభించే సేంద్రీయ సమ్మేళనాలు కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పొట్టను శుద్ధి చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇందులో లభించే పోషకాలు మలబద్ధకం, ఆమ్లత్వం, తిమ్మిరి వంటి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
చుండ్రు-జుట్టు రాలడం సమస్యలకు చెక్:
తరచుగా చుండ్రు, జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బే ఆకులను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా ఉంచడమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా బే ఆకును మరిగించి తయారు చేసుకున్న నీటిని జుట్టుకు పట్టి శుభ్రం చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా సులభంగా తగ్గుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
ప్రతి రోజు బే ఆకుల నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ ఎ, బి6, విటమిన్ సి వంటి గుణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు బే ఆకుల టీని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి