Kidney Damage: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే..!

Kidney Problems Symptoms: శరీరంలో కిడ్నీల పాత్ర చాలా ముఖ్యమైనది. మీ బాడీలో ఈ మార్పులు కనిపిస్తే మీ కిడ్నీలు పాడువుతున్నట్లు అర్థం చేసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 09:26 AM IST
Kidney Damage: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్లే..!

Kidney Damage Symptoms: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే కిడ్నీపై ఏ చిన్న దుష్ర్పభావం కూడా మీ ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. మీ బాడీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు చెడిపోతున్నాయని అర్థం. అంతేకాకుండా ముందు ముందు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలసట ఎక్కువ అనిపిస్తే..
మీరు సాధారణం కంటే ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తే మీ కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని మరియు శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లడం లేదని అర్థం.
వ్యర్థాలు పేరుకుపోతే..
కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. మీ చర్మం పొడిబారడం, దురద పుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి
కండరాల్లో నొప్పి వస్తే..
కిడ్నీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, శరీరంలో టాక్సిన్స్ మరియు ఖనిజాల స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దాని ప్రభావం మన కండరాలపై పడుతుంది. కండరాల్లో విపరీతమైన నొప్పి వచ్చిందంటే కిడ్నీలు పాడైనట్లు లెక్కే. 
సరిగ్గా నిద్ర పట్టకపోతే..
ఆరోగ్యవంతమైన మనిషికి రోజూ 7-8 గంటల నిద్ర అవసరం. ఆ ప్రక్రియ సరిగ్గా జరగలేదంటే మీ మూత్రపిండాల్లో ఏదో సమస్య ఉందన్న మాటే. 
ఎర్రరక్తకణాల ఉత్పత్తిపై ప్రభావం..
కిడ్నీలో సమస్య వచ్చిందంటే ఎర్రరక్తకణాలను తయారు చేసేందుకు అవసరమైన ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ లోపం ఏర్పడుతుంది. దీని కారణంగా ఎర్రరక్తకణాలు ఉత్పత్తి తగ్గుతుంది.  అంతేకాకుండా శ్వాస సమస్యలు కూడా తలెత్తుతాయి.

Also Read: Oversleeping Side Effect: మీరు అతిగా నిద్రపోతున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News