Walking Benefits: రోజూ ఉదయం అరగంట సేపు నడిస్తే చాలు.. ఈ 3 వ్యాధులు రావు..!

Benefits Of  Walking: మార్నింగ్ వాక్ చేయడం చాలా మంచిది. రోజూ అరగంట సేపు నడిస్తే చాలు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మిమ్మల్ని ఏ వ్యాధులు చుట్టుముట్టవు. నడవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2023, 10:49 AM IST
Walking Benefits: రోజూ ఉదయం అరగంట సేపు నడిస్తే చాలు.. ఈ 3 వ్యాధులు రావు..!

Morning Walk Benefits: మనం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే నడకని మించినది మరొకటి లేదు. అందుకే ఆరోగ్య నిపుణులు రోజూ 5000 అడుగులైనా నడవాలని సూచిస్తారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొద్ది దూరమైన సరే బైక్ లేదా కారు మీద వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. దీని వల్ల వారు అనారోగ్యాల బారిన పడుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల బాడీ మెుత్తం కదలడంతోపాటు అవయవాలన్నీ వేగంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. రోజూ 20 నుండి 30 నడిస్తే చాలు మీరు ఏ ఇతర వ్యాయామం చేయనవసరం లేదు.  వాకింగ్ చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. నడక వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. 

నడక వల్ల లాభాలు
స్టామినా పెరుగుతుంది
రోజూ ఉదయం అరగంట పాటు నడవడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి..  ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ స్టామినా పెరుగుతుంది. దీని వల్ల మీరు మెట్లు ఎక్కడం, వేగంగా పరుగెత్తడం, భారీ వ్యాయామాలు చేయడం వంటి చాలా కష్టమైన పనులను చేయడంలో ఇబ్బంది పడరు.
బరువు తగ్గిస్తుంది
ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే చాలా మంది శారీరక శ్రమను తగ్గించడం. కాబట్టి పొట్ట రావడం మరియు నడుమ చుట్టూ భారీగా కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ప్రతి రోజూ ఉదయం ఓ అరగంట సేపు నడవటం వల్ల ఊబకాయం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా వాకింగ్ వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, మధుమేహం వంటి వ్యాధులు రావు. 
గుండె జబ్బులకు చెక్
రోజూ ఉదయం వాకింగ్ చేసేవారిలో కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, గుండెపోటు వంటి జబ్బులు రావు. ఎందుకంటే ఇది రక్తంలోని కొవ్వుతోపాటు సిరల్లోని అడ్డంకిని తొలగిస్తుంది. దీని వల్ల గుండెకు మెరుగ్గా రక్తప్రసరణ జరుగుతుంది. 

(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Weight Loss tips: మీరు లావైపోతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కా పాటించండి చాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News