Sabja Seeds Benefits: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో పడి జనాలు సమయానికి తినడం పోవడం, వర్క్ ఫ్రం హోం పేరిట చాలా మంది తింటూ కుర్చీలకే అతుక్కుపోవడం, వ్యాయామం చేయకపోవడం తదితర కారణాల వల్ల బరువు ఎక్కువగా పెరుగుతున్నారు. చాలా మంది సులువుగా వైట్ లాస్ అవ్వడానికే చూస్తున్నారు. మీ బరువు అదుపులో ఉంచుకోవాలన్నా, తగ్గాలన్నా డైట్ లో సబ్జా గింజలను చేర్చుకోవడం మంచిది.
సబ్జా గింజల నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ కె, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫ్యాటీ యాసిడ్లు, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. సబ్జా గింజల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
సబ్జా గింజల ప్రయోజనాలు
బరువు తగ్గుతారు
సబ్జా గింజలను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. దీని కోసం మీరు సబ్జా గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం దానికి నిమ్మరసం కలిపి తాగడం వల్ల వైట్ లాస్ అవుతారు. అంతేకాకుండా ఆకలి కూడా తగ్గుతుంది.
మలబద్ధకం నుండి ఉపశమనం
సబ్జా గింజలు ఉదర సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి, కాబట్టి మీరు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో ఈ గింజలను తప్పకుండా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలబద్ధకం, గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
ఎముకలు బలోపేతం
ఈ రోజుల్లో చాలా మంది ఎముకల బలహీనత బారిన పడుతున్నారు. సబ్జా గింజల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ గింజలను తీసుకోవడం వల్ల మీ బోన్స్ గట్టిపడతాయి.
డయాబెటిక్ దూరం
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది వరమనే చెప్పాలి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇది కోలెస్ట్రాల్ ను కూడా అదుపులో ఉంచుచుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Kissing Health Benefits: ముద్దుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ముద్దు మంచిదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK