Ragi Pindi Puri: రాగి పిండి పూరీలు ఎంతో టేస్టీ.. తయారు చేసుకోండి ఇలా..!

Ragi Pindi Puri Recipe: రాగిపిండి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని తయారు చేయడం ఎంతో సులభం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2024, 11:13 AM IST
Ragi Pindi Puri: రాగి పిండి పూరీలు ఎంతో టేస్టీ.. తయారు చేసుకోండి ఇలా..!

Ragi Pindi Puri Recipe: ఆధునిక కాలంలో చాలా మంది ప్రాసెసింగ్  ఫుడ్ , అతిగా నూనెలో వేయించిన ఆహారపదార్థాలు, అధిక కొవు కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాగే జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా శరీరంలో కొవ్వు చేరి అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు కలుగుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ఆరోగ్యకరమైన  ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా తృణధాన్యాలతో తయారు చేసిన పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. 

రాగిపిండి తృణధాన్యాలతో తయారు చేయబడినది. రాగిపిండితో చేసే వంటకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మైదాపిండి, కార్న్‌ ఫ్లోర్‌ వంటి పిండితో పోలుస్తే ఇది ఎంతో మంచిది. వేసవిలో ఈ పిండితో రాగి జావ తయారు చేసి తీసుకోవడం మంచిది.  అయితే ఈ రాగిపిండితో జావ మాత్రమే కాకుండా మీరు పూరీలు కూడా తయారు చేసుకోవచ్చు.  వీటిని తయారు చేయడం ఎంతో సుల‌భంగా.. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కావ‌ల్సిన ప‌దార్థాలు: 

రాగిపిండి – ఒక క‌ప్పు

 గోధుమ‌పిండి – ఒక క‌ప్పు

బొంబాయి ర‌వ్వ – 2 టీ స్పూన్స్

నూనె – డీప్ ఫ్రై

త‌యారీ విధానం: 

ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకోవాలి. ఆ తరువాత గోధుమపిండి, రవ్వ తీసుకొని కలుపుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకొని పిండిని చపాతీ పిండిగా చేసుకోవాలి. పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. తరువాత పిండిని తీసుకుంటూ ఉండలుగా చేసుకొని నూనె రాసుకుంటూ పూరీలాగా తయారు చేసుకోవాలి. 

ఇప్పుడు ఈ పూరీల‌ను వేడి నూనెలో వేసుకోవాలి. పూరీని రెండు వైపులా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ విధగంగా రుచిగా ఉండే రాగిపిండి పూరీలు త‌యార‌వుతాయి. దీని నాన్ వెజ్ క‌ర్రీలు, మ‌సాలా కూర‌ల‌, కూరగాయల కూరతో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా వీటిని తింటారు కూడా. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. బయట మైదాతో తయారు చేసే పూరీల కంటే ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే స్నాక్స్‌, బ్రేక్‌ ఫాస్ట్‌లో సమయంలో వీటిని పిల్లలు ఇవ్వడం చాలా మంచిది. వారు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. మీరు కూడా తప్పకుండా ఈ పూరీలను తయారు చేసుకోండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News