Heel Pain Relief: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మడమ నొప్పిలతో బాధపడుతున్నారు. చాలా మంది దీని తీవ్రత భరించలేక వైద్యులను సంప్రదిస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్న పలు రకాల మూలికలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మడమ నొప్పిల సమస్య నుంచి ఉపశమనం లభించడానికి జిల్లేడు ఆకులను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇందులో ఉండే గుణాలు శరీరానికి సంబంధించి వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుందని శాస్త్రం పేర్కొంది. అయితే ఈ ఆకులను వాడడం వల్ల ఎలాంటి ఉపశమనం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
జిల్లేడు ఆకులను ఎలా ఉపయోగించాలి:
జిల్లేడు ఆకులతో ఉపశమనం పొందడానికి ముందుగా ప్యాన్‌లో కొద్దిగా నీరు, ఈ ఆకులను వేసి మరిగించాలి. ఆ తర్వాత ఉడికించిన నీరుతో మడమలను కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల త్వరలోనే ఉపశమనం పొందుతారు.
నొప్పి మాయమవుతుంది:
ఇది మడమ నొప్పిని చాలా వరకు నయం చేస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో ఈ ఆకులను విషపూరితమైనదిగా పేర్కొన్నారు. కావున వీటిని వైద్య సమయంలో జాగ్రత్తగా వినియోగించాలి.
యువతకుల్లో మడమ నొప్పి:
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల యువతలో మడమ నొప్పులు ఉత్పన్నమవుతున్నాయి. దీని కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని కోసం ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. మడమ నొప్పులుంటే ఈ ఆకుల వల్ల ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Health Benefits Of Egg Yolk : గుడ్డు పచ్చసొన తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!
Also Read: Monsoon Diet: వర్షాకాలంలో చైనీస్ ఫుడ్ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook