థైరాయిడ్ అనేది జీవనశైలి వ్యాధుల్లో ఎందుకంత ప్రమాదకరమైంది, సమస్యాత్మకమైందంటే..ఇందులో సమస్య ఉంటే మిగిలిన వ్యాధులు తలెత్తుతాయి. థైరాయిడ్ అనేది శరీరంలో అతిపెద్ద గ్రంథి. ఈ గ్రంథి బాగున్నంతవరకే అంతా బాగుంటుంది.
సాధారణంగా పాలు, పంచదార టీని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. కానీ ఆరోగ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. కారణం ఇందులో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కెఫీన్ అనేది అధిక రక్తపోటు, డయాబెటిస్ ముప్పును పెంచుతుంది. అందుకే హెర్బల్ టీ తాగాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. దేశంలో ప్రస్తుతం థైరాయిడ్ సమస్య వేగంగా వ్యాపిస్తోంది. ఈ గ్రంధిలో ఏదైనా సమస్య తలెత్తితే మొత్తం శరీరంలో ఆ ప్రభావం పడుతుంది. ఓ ప్రత్యేకమైన హెర్బల్ టీ తాగడం వల్ల థైరాయిడ్ సమస్య చాలావరకూ తగ్గుతుంది.
క్యామోమిల్ టీ ఉపయోగాలు
క్యామోమిల్ టీ అనేది సాధారణంగా అన్నిచోట్లా అందుబాటులో ఉండదు. ఆరోగ్య దృష్ట్యా ఇది చాలావరకూ లాభదాయకం. ఎందుకంటే ఇందులో సహజసిద్దమైన కెమికల్స్ ఉంటాయి. వీటినే ఫ్లేవనాయిడ్స్ అంటారు. ఇవి చాలా రకాల మొక్కల్లో లభించే న్యూట్రియంట్లు. అందుకే క్యామోమిల్ టీలో చాలా ఔషధ గుణాలుంటాయి. థైరాయిడ్ సమస్యను చాలా సమర్ధవంతంగా తగ్గిస్తుంది.
క్యామోమిల్ టీతో థైరాయిడ్ ఎలా తగ్గుతుంది
ప్రముఖ డైటీషియన్లు అందించే వివరాల ప్రకారం థైరాయిడ్ నియంత్రణకు క్యామోమిల్ టీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి కేశాలు త్వరగా రాలిపోతుంటాయి. ఈ సమస్యకు క్యామోమిల్ టీ క్రమం తప్పకుండా తాగడం మంచి ప్రత్యామ్నాయం కాగలదు.
క్యామోమిల్ టీ తాగడం వల్ల థైరాయిడ్ సమస్య పూర్తిగా తొలగిపోదు గానీ చాలావరకూ నియంత్రణలో ఉంటుంది. థైరాయిడ్ కారణంగా ఏర్పడే ఇతర దుష్పరిణామాల్ని తగ్గిస్తుంది.
క్యామోమిల్ హెర్బల్ టీ తాగడజం వల్ల థైరాయిడ్ కారణంగా ఏర్పడే ఇతర సమస్యలు జుట్టు రాలడం, పల్చని కేశాల సమస్య దూరమౌతుంది. ముఖ్యంగా స్థూలకాయం అదుపులో వస్తుంది.
లావుగా ఉన్నవాళ్లు ఈ హెర్బల్ టీ కచ్చితంగా తాగాల్సి ఉంటుంది. దీనివల్ల కడుపు, నడుము చుట్టూ ఉండే కొవ్వు క్రమక్రమంగా కరిగిపోతుంది. బరువు కాస్తా తగ్గుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్థులకు క్యామోమిల్ టీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది తాగిన తరువాత బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.
క్యామోమిల్ టీ మానసిక ఆరోగ్యానికి సైతం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో టెన్షన్, స్ట్రెస్ దూరం చేసే పోషకాలు చాలా ఉంటాయి. క్యామోమిల్ టీ తాగడం వల్ల ఫ్రెష్‌నెస్ కలుగుతుంది.
Also read: Kidney Disease: కిడ్నీలు దెబ్బ తింటే ఈ ఇన్ఫెక్షన్స్ తప్పవు, కాబట్టి తస్మాత్ జాగ్రత్త!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook