Hing Water Benefits: ఇంగువను మనం వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో మంచి అరోమా ఉంటుంది. దీంతో వంటకు కూడా రుచి వస్తుంది. అయితే, ఇంగువ నీరు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంగువలో యాంటీమైక్రోబయల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్,యాంటీ-క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. అసలైన ఇంగువ సువాసన ఇంటి నిండా వ్యాపిస్తుంది. దీని అరోమా అటుంటిది ముఖ్యంగా మన వంటగదిలో ఇంగువకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంగువ నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై అనేక ప్రభావాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అంతేకాదు ఇది పేగు వ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది. ప్రేగు క్రమబద్ధతను కాపాడుతుంది. దీంతో జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ఇంగువనీటిని మీ డైట్లో చేర్చుకోవాలంటే ఒక గ్లాసు నీటిల ఒక చెంచా ఇంగువను వేసుకోవాలి. ఇందులో పసుపు కూడా వేసుకుంటే మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ నీటిని ఉదయం బ్రష్ చేసిన వెంటనే పరగడుపున తీసుకోవాలి. ఇంగువను నీటిలో బాగా కరిగే వరకు కలపాలి.ఈ నీటిని ఇలా తాగడం వల్ల బరువు సులభంగా తగ్గిపోతారు. ఇంగువ నీటిని తాగడం వల్ల ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతోపాటు, రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. అంతేకాదు ఇంగువ నీటిని పరగడుపున తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అంతేకాదు కడుపు సంబంధిత సమస్యలు ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తుంది.
చర్మాన్ని మెరుగుపరుస్తుంది..
ఇంగువలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇంగువ నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. దీంతో చర్మం త్వరగా వృద్ధాప్యం కాకుండా మెరుస్తుంది. ముఖ్యంగా ఇంగువ నీరు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కాపాడుతుంది.
బరువు తగ్గుతారు..
వెయిట్ లాస్ జర్నీ చేస్తూ బరువు తగ్గించే పానీయం కోసం చూస్తున్నట్లయితే ఇంగువ నీరు మీకు బెస్ట్. దీంతో బరువు స్పీడ్ గా తగ్గుతారు. జీవక్రియ నేరుగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇంగువ నీరు మీ జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గాలనుకోవాలనుకునేవారికి ఇంగువ మంచి ఆప్షన్
ఇదీ చదవండి: బెండకాయను ఇలా తినండి.. గ్యారంటీగా షుగర్‌గా తగ్గిపోతుంది..
పీరియడ్స్ పెయిన్..
మహిళలు ప్రతినెలా పీరియడ్ పెయిన్స్ ను ఎదుర్కొంటారు. అయితే, ఏ మెడిసిన్స్ వేసుకోకుండానే పీరియడ్స్ పెయిన్ కు ఇంగువ నీటితో చెక్ పెట్టొచ్చు. ఇంగువ నీటిని తాగడం వల్ల పీరియడ్స్ పెయిన్ నుండి సహజసిద్ధంగా ఉపశమనం లభిస్తుంది పీరియడ్స్ తిమ్మిరి, నొప్పి మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే ఇంగువ నీటిని తాగండి.
ఇదీ చదవండి: పోషకాలు పుష్కలంగా ఉండే టమోటాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
జలుబు, దగ్గు..
జలుబు దగ్గుతో బాధపడేవారికి కూడా ఇంగువ నీరు తక్షణ రెమిడీగా పనిచేస్తుంది. ఇంగువ నీరులో యాంటీ మైక్రోబ్రియల్, యాంటీ బయోటిక్ లక్షణాలు ఉండటం వల్ల ఇవి శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఇంగువ నీటిని తాగడం ద్వారా జలుబును నివారించవచ్చు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి