Cold And Cough: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా కేవలం 1 రోజులో జలుగు, దగ్గుకు చెక్‌ పెట్టండి..

Home Remedies For Cold And Cough: వర్షాకాలం కారణంగా చాలా మంది జలుగు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం క్రమం తప్పకుండా పసుపు పాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2022, 10:59 AM IST
  • జలుగు, దగ్గు సమస్యలతో బాధపడుతున్నారా..
  • అయితే క్రమం తప్పకుండా పసుపు పాలు తీసుకోండి.
  • వేడి నీరు, ఉప్పు పుక్కిలించండి.
 Cold And Cough: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా కేవలం 1 రోజులో జలుగు, దగ్గుకు చెక్‌ పెట్టండి..

Home Remedies For Cold And Cough: వాతావరణంలో మార్పుల కారణంగా చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వర్షాల కారణంగా సీజనల్‌ వ్యాధులనైనా  జలుబు, ఫ్లూ బారిన చాలా మంది పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడాని పలు రకాల చిట్కాలను వినియోగించాని నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి ఖర్చులేకుండా ఉపశమనం పొందవచ్చు.

ఆయుర్వేదం ఏమి చెబుతోంది:
ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం.. ఈ సీజనల్‌ వ్యాధుకు మెంతులు తీసుకోవాలని  ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు లేదా వైరల్ వంటి సమస్యలు నుంచి బయటపడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీని కోసం మెంతి నీరు ఉపయోగించాలి. ఇలా జలుబులు, దగ్గులు ఉంటే కేవలం సులభంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు పెర్కొన్నారు.

జలుబు, దగ్గు కోసం ఈ ఇంటి నివారణలను అనుసరించండి:
వేడి నీరు, ఉప్పు పుక్కిలించండి:

జలుబు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ చిట్కాను వినియోగించాలి. దీని కోసం మీరు  గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే దగ్గు వల్ల వచ్చే గొంతు
సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా సులభంగా దగ్గు కూడా తగ్గుతుంది.

పసుపు పాలు తీసుకోండి:
జలుబు, దగ్గు ఉంటే తప్పకుండా మీరు పాలలో పసుపును వేసుకుని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షలు అధిక పరిమాణంలో ఉంటాయి.  ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

తులసి టీ తాగండి:
తరచుగా దగ్గు లేదా శ్లేష్మం సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులతో తయారు చేసిన టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం మీరు తాజా తులసి ఆకులను తీసుకుని వాటిని కప్పు నీటిలో వెసి మరిగించాలి. ఇలా చేయడం వల్ల సులభంగా దగ్గు, జలుబు సమస్యలు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీతో పాటు అందులో తేనెను వేసి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్

Also Read : Bollywood Affairs: ఎంగేజ్‌మెంట్ తర్వాత పెళ్లి కాకముందే బ్రేకప్ చెప్పుకున్న జంటలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

 

Trending News