Homemade Face Wash: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ముఖంపై చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందిలో ముఖంపై మురికి పేరుకు పోవడం, ఇతర సమస్యల ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అయితే ఇంట్లో లభించే పలు రకాల వస్తువులతో ఫేస్ వాష్ తయారు చేసుకుని వాడితే.. చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా చనిపోయిన చర్మ కణాలను తిరిగి పెంపొందిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఫేస్ వాస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
చర్మ సౌందర్యం కోసం శనగ పిండితో చేసిన ఫేస్ వాష్ వాడొచ్చు. ఈ పిండిలో ఉండే గుణాలు చర్మాన్ని రీపేర్ చేయడమేకాకుండా చర్మాన్ని సంరక్షిస్తాయి. వీటిలో ఉండే గుణాలు మొటిమల నుంచి కాపాడుతాయి. కావున చర్మానికి శనగ పిండితో చేసిన ఫేస్ వాష్ వాడడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
మచ్చలను తగ్గిస్తాయి:
సూర్యరశ్మి కారణంగా చాలా మందిలో మొటిమల సమస్యలు, మచ్చల సమస్యలు వస్తుంటాయి. వాటిని తొలగించడానికి శనగ పిండి ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం పెరుగులో శనగపిండిని కలిపి ముఖానికి అప్లై చేయండి.
చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది:
చర్మం నుంచి మృతకణాలు, మురికిని తొలగించి ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీని కోసం పెరుగులో శెనగపిండిని కలిపి ముఖానికి అప్లై చేయండి. ఇలా వారానికి రెండుసార్లు ముఖానికి స్క్రబ్ చేస్తే అన్ని ముఖానికి సంబంధించి చర్మ సమస్యలన్ని దూరమవుతాయి.
చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి:
శనగపిండితో ముఖాన్ని మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. శుభ్రం చేయడం వల్ల ముఖంపై ఆయిల్ తొలగిపోతుంది. ముఖంపై పెరిగే చిన్న వెంట్రుకలు కూడా రాలిపోతాయి. కావున చర్మానికి శనగ పిండితో చేసిన పేస్ట్‌ను వినియోగించి సమస్యల నుంచి విముక్తి పొందండి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook