Housework Benefits: ఇంటి పనులు చేసే వృద్ధుల్లో జ్ఞాపకశక్తి, శ్రద్ధ మెరుగ్గా ఉండడం సహా కాళ్లలో ధృఢత్వం పెరుగుతుందని ఓ అధ్యయనం పేర్కొంది. దీంతో పాటు శరీరంలో చురుకుదనం వస్తుందని పరిశోధకులు అందులో వెల్లడించారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్రమం తప్పకుండా శారీరక శ్రమ మంచిదని ఆ అధ్యయనం తెలియజేస్తుంది. కదలకుండా ఒక చోట కూర్చోవడం వల్ల తక్కువ సమయంలో మరణం సంభవించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
గ్లోబల్ మానిటరింగ్ డేటా-2016 ప్రకారం.. దశాబ్ద కాలంలో ప్రజలకు సరైన శారీరక శ్రమ తగ్గిందని తెలిపింది. పేద దేశాలతో పోలిస్తే సంపన్న దేశాల్లో ప్రజలు ఎక్కువగా శారీరక శ్రమ చేయడం లేదని తేలింది. ఇలాంటి సంపన్న దేశాల్లో వృద్ధులు ఎక్కువగా శారీరక శ్రమ కోసం తగిన సమయాన్ని కేటాయిస్తున్నారని తెలుస్తోంది.
ఇంటి పనుల ద్వారా శారీరంగా ఆరోగ్యంగా ఉంటారని నిరూపించేందుకు.. 21 నుంచి 90 వయసుల మధ్య వయసున్న వారిని 489 మందిని ఎంచుకున్నారు. వీరిని రెండు బృందాలుగా విభజించారు. 21 నుంచి 64 వయసుల మధ్య ఉన్న వారిని 249 మందిని ఎంచుకున్నారు. ఈ బృందానికి యంగ్ గ్రూప్ గా నామకరణం చేశారు పరిశోధకులు.
ఆ తర్వాత 65 నుంచి 90 మధ్య వయసున్న 240 మందిని రెండో గ్రూప్ లో చేర్చారు. ఈ బృందానికి వయసు పైబడిన వారిగా పేరు పెట్టారు. ఈ రెండు గ్రూప్ లలో ఉన్న వారి శారీరక శ్రమను అంచనా వేసేందుకు కొన్ని టాస్క్ లు అసైన్ చేశారు.
ఇంటి పనులు వంటివి బట్టలు ఉతకడం, దుమ్ము దులపడం, ఇస్త్రీ చేయడం, ఇల్లు సర్దడం, వ్యాక్యూమింగ్ చేయడం, ఫ్లోర్ ను కడగడం, పెయింటింగ్ లేదా ఇంటిని చక్కగా అలంకరించడం లాంటి పనులు ఇచ్చారు. అయితే ఈ పని తీవ్రత లేదా పని కోసం ఖర్చు అయిన శక్తిని కేలరీల రూపంలో సూచిస్తారు.
యంగ్ గ్రూప్ లో ఉన్నవారిలో మూడింట ఒక వంతు అంటే 36 శాతం (90 మంది) కంటే వయసు పైబడిన వారి గ్రూప్ లో సగానికి దగ్గరగా అంటే 48 శాతం (116 మంది) మందిలో ఎక్కువ కేలరీలు ఖర్చు అయినట్లు తేలింది. దీన్ని బట్టి యంగ్ గ్రూప్ లో కంటే ఇంటి పనులు చేయడం ద్వారా వృద్ధులకే ఎక్కువ ప్రయోజనమని పరిశోధనలో వెల్లడైంది. ఇంటి పనుల ద్వారా యువకులతో పోలిస్తే వృద్ధుల్లో ఎక్కువ జ్ఞాపకశక్తి పెరిగినట్లు, కాళ్లలో ధృఢత్వం పెరిగినట్లు పరిశోధన తేల్చింది.
Also Read: పోస్టాఫీసు డిపాజిట్ పథకాల్లో టాప్ 5 పథకాలు..ప్రత్యేకతలు ఇవే
Also Read: Foods For Warming The Body: చలికాలంలో శరీరానికి వెచ్చదనం ఇచ్చే ఆహారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook