ఇంటికి శోభనిచ్చే మొక్కలు

Last Updated : Oct 31, 2017, 02:56 PM IST
ఇంటికి శోభనిచ్చే మొక్కలు

పూల మొక్కలు పెరట్లో పెంచుకుంటే ఇల్లంతా నందనవనంలా కనిపిస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కొందరికి రంగురంగుల పూలమొక్కలు ఇష్టం.. మరికొందరికి తీగ మొక్కలు అంటే ఇష్టం.. ఇంకొందమందికేమో పొదల ముక్కలు అంటే ఇష్టం. మొక్కలు పెంచుకోవడం ఒక ఆర్ట్. దానిని ఎంచుకొనేటప్పడు ఎత్తు, రంగు దృష్టిలో ఉంచుకోవాలి. ఆ మొక్క వాతావరణాన్ని ఎంతవరకు తట్టుకుంటుందో చూసి ఎంచుకోవాలి. వీలైతే బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి పరిశీలించండి. వారేమీ అనుకోరు. మొక్కలు పెంచుకుంటానంటే ఎవరు వద్దంటారు? చెప్పండి. 

* పూలు, పొదలు, తీగ మొక్కలు ఇంటి పెరట్లో పెంచుకోవచ్చు. ప్రస్తుతం నర్సరీలో రకరకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మీ ఇష్టాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.
 
* పూల మొక్కలు ఇంటిని చూడటానికి ఆకర్షణీయంగా మారుస్తాయి. వీటిని పెంచుకోవడానికి మట్టి కుండీలు లాంటివి ట్రై చేయండి.  
 
* మొక్కలకు సరిపడా నీరు పట్టడం చాలా అవసరం. ఏ మొక్కకు ఎంత నీరుపట్టాలి అనే విషయాన్ని  నర్సరీలోనే అడిగి తెలుసుకోవడం ఉత్తమం. 
 
* మొక్కలు నాటిన వారం రోజులూ నీరు పట్టాలి.  రెండోవారంలో రోజు మరుసటి రోజు నీరు పడితే చాలు.  మొక్కలు బాగా పెరిగాక వారానికోసారి నీరు పట్టండి.  ఈ నిబంధన అన్ని రకాల మొక్కలకు వర్తించదు. కొన్ని మొక్కలకు రోజూ నీరు పట్టాలి. 

* ఎండిపోయిన మొక్కలుంటే వెంటనే తీసేయండి. లేకుంటే అందమైన పూలమొక్కల మధ్యలో అది అందవిహీనంగా కనిపిస్తుంది. 

*వేప నూనె లేదా వేప పిండి కలిపినా లీటర్ నీళ్లను వారానికోసారి పిచికారి చేస్తే మొక్కలకు తెగుళ్లు, వ్యాధులు, పురుగులు పట్టవు. 

* మొక్కలు పెంచేటప్పుడు దానికి ఎటువంటి మట్టి అవసరమో నర్సరీలో అడిగి తెలుసుకోండి. మీకు అందుబాటులో  దొరికే మట్టితో ఎటువంటి మొక్కలను పెంచవచ్చో కూడా అడగండి. 

Trending News