How To Improve Sleep Quality: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడితో చాలా మందికి నిద్ర కరువతోంది. టైమ్‌తో సంబంధం లేకుండా పని చేస్తూ కొంతమంది నిద్రకు దూరమవుతుంటే.. మొబైల్ ప్రపంచంలో ముగినిపోయి మరికొందరు సరిగా నిద్రపోవడం లేదు. నిద్రలేమి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతున్నారు. సరిగా నిద్రపోక పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి..? ఎలాంటి ఇబ్బందులకు గురవుతారు..? రోజుకు ఎన్ని గంటలు నిద్ర పోవాలి..? అనే అంశాలపై ప్రముఖ న్యూరోలజిస్ట్ డాక్టర్ ఓం ప్రకాశ్ ప్రసాద్ కీలక సూచనలు చేశారు. నిద్రను మెరుగుపరిచే మెళకువలను వివరించారు. ఆయన చెప్పిన ముఖ్యమైన విషయాలు ఇవే..
నిద్రలేమి కారణంగా వచ్చే సమస్యలు
❋ తగినంత నిద్రలేపోవడం వలన శరీరంలో క్యాన్సర్ కణాలు అతివేగంగా పెరిగే అవకాశం ఉంది.
❋ మెదడు పనితీరుకు నిద్ర చాలా ముఖ్యం
❋ నిద్రలేమి కారణంగా కొత్త విషయాలను నేర్చుకోవడంలో మెదడు పనితీరు 40 శాతం తగ్గుతుంది.
❋ దీర్ఘకాలిక నిద్రలేమి అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది.
❋ లింఫాటిక్ వ్యవస్థ మాదిరిగానే మెదడులోని గ్లింఫాటిక్ వ్యవస్థ అన్ని విషపూరిత జీవక్రియ ఉప ఉత్పత్తులను తొలగిస్తుంది.
Also read: Dandruff: ఎలాంటి ఖర్చు లేకుండా కరివేపాకుతో చుండ్రు సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
నిద్ర మెరుగుపరిచే టిప్స్ ఇవే..
❋ మీరు నిద్రకు ప్రాముఖ్యతను ఇస్తేనే మీ నిద్ర మెరుగుపడుతుంది.
❋ టైమ్‌కు నిద్రపోయేలా ఖచ్చితంగా షెడ్యూల్‌ను తయారు చేసుకోండి. సమయానికి పడుకోవడం, నిద్ర లేవడం అలవాటు చేసుకోండి
❋ బెడ్ రూమ్ చల్లగా ఉండేలా చూసుకోండి. బెడ్ రూమ్ ఉష్టోగ్రత 18 డిగ్రీలు ఉండేలా ఏర్పాటు చేసుకోండి
❋ మెరుగైన నిద్ర కోసం నిద్రవేళకు ముందు వెచ్చటి నీటితో స్నానం చేయండి.
❋ నిద్ర కోసం హార్మోన్ మెలటోనిన్ విడుదలను ప్రోత్సహించడానికి బెడ్ రూమ్‌లో చీకటి ఉండేలా చూసుకోండి
❋ నిద్రకు మూడు గంటల ముందు ఆహారం తీసుకోవద్దు. మధ్యాహ్నం 2 గంటల తరువాత కెఫిన్ తీసుకోవడం మానేయండి.
❋ నిద్ర పోవడానికి 90 నిమిషాల ముందు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి.
❋ బెడ్ రూమ్ కేవలం నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగించండి.
❋ సర్కాడియన్ రిథమ్ సెట్ చేసుకోవడానికి ఉదయం నిద్రలేవగానే సూర్యకాంతిలో ఉండండి. తప్పకుండా వ్యాయమం చేయండి.
❋ ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజువారి మీ దినచర్యలో ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.
❋ నిద్రకు ప్రాధ్యానత్య ఇవ్వాలని.. సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి నిద్ర చాలా అవసరం అని డాక్టర్ ఓం ప్రకాశ్ ప్రసాద్ సూచించారు.
❋ ప్రతి ఒక్కరు రోజులో తప్పకుండా 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుంది
Also read: Carrots Benefits: ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే క్యారెట్‌ను వదలకుండా ప్రతిరోజు తింటారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook