Curry Leaves Remedies For Dandruff: జుట్టులో చుండ్రు పెరగడం కారణంగా జుట్టు బలహీనంగా తయారవుతుంది. అంతేకాకుండా దీని కారణంగా జుట్టు కూడా సులభంగా రాలిపోతోంది. చాలా మందిలో జుట్టులో చుండ్రు కారణంగా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. శీతాకాలంలో జుట్టు పొడిబారడంతో పాటు చుండ్రు వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద నిపుణులు సూచించిన కరివేపాకుతో తయారు చేసిన కొన్ని రెమెడీస్‌ను వినియోగిస్తే సులభంగా చుండ్రు ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
కరివేపాకులో ఉండే పోషకాలు:
కరివేపాకులో ప్రోటీన్, విటమిన్లు, ఐరన్, బీటా కెరోటిన్, కాల్షియంతో పాటు ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. దీంతో పాటు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా లభిస్తాయి. కాబట్టి కరివేపాకును మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
చుండ్రు సమస్యల కోసం:
కరివేపాకు, పెరుగు:
పెరుగు, కరివేపాకు హెయిర్ ప్యాక్‌ను మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు వినియోగించడం వల్ల చుండ్రు సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా తెల్ల జుట్టు నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి జుట్టు రాలడం, ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కరివేపాకు మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
కరివేపాకు నీరు:
కరివేపాకును ఉడకబెట్టి ఆ నీటీ జుట్టుకు పట్టించడం వల్ల జుట్టులోని చుండ్రు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి. కాబట్టి తల స్నానం చేయడానికి ముందు ఈ నీటిని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి