How To Make Anti Dandruff Oil: చలి, వేసవి కాలల్లో జుట్టు చుండ్రు రావడం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో చాలా యాంటీ డాండ్రఫ్ షాంపూలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వినియోగించడం వల్ల తీవ్ర జుట్టు సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే సులభంగా చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన యాంటీ డాండ్రఫ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్‌ను వినియోగించడం వల్ల సులభంగా చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం పొందడమేకాకుండా జుట్టు రాలడాన్ని నియంత్రించుకోవచ్చు. ఆలివ్ ఆయిల్, తేనె రెండింటినీ మిక్స్ చేసి స్కాల్ప్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో లభించే గుణాలు స్కాల్ప్ డ్రైనెస్ తొలగించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆలివ్ ఆయిల్లో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి స్కాల్ప్‌పై ప్రతి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఈ నూనె తయారి విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ డాండ్రఫ్ ఆయిల్ తయారీకి అవసరమైన పదార్థాలు:
ఆలివ్ నూనె
తేనె
యాంటీ డాండ్రఫ్ ఆయిల్‌ను తయారు చేసుకునే విధానం?:
యాంటీ డాండ్రఫ్ ఆయిల్ చేయడానికి, ఒక మంచి గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ గిన్నెలో కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్, తేనెను సమాన పరిమాణంలో వేసుకోవాలి.
ఆ రెండింటినీ బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
ఇవి రెండింటిని కలిపిన తర్వాత ఒక చిన్న బాటిల్లో నిల్వ చేసుకోవాలి.
యాంటీ డాండ్రఫ్ ఆయిల్ ఎలా ఉపయోగించాలి?:
యాంటీ డాండ్రఫ్ ఆయిల్ జుట్టుకు బాగా అప్లై చేయాల్సి ఉంటుంది.
ముని వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయండి.
ఇలా అప్లై చేసిన తర్వాత జుట్టును వేడి టవల్‌తో చుట్టండి.
సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచండి.
ఆ తర్వాత తేలికపాటి షాంపూ సహాయంతో జుట్టును కడిగి శుభ్రం చేసుకోండి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook