How To Make Oats Heel Scrub: ఓట్స్ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఓట్స్ గ్లూటెన్ ఫ్రీ కావడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అందుకే చాలా మంది దీనిని బరువు తగ్గే క్రమంలో డైట్‌లో వినియోగిస్తారు. అంతేకాకుండా ఇందలో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తాయి. కాబట్టి దీనిని డైట్‌లో వినియోగించడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే దీని వల్ల శరీరానికే కాకుండా మడమల సమస్యకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. దీనితో తయారు చేసిన స్క్రబ్‌ను వినియోగించడం వల్ల మృదువైన మడమలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని అంటున్నారు. అయితే ఎలాంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఓట్స్ హీల్ స్క్రబ్ చేయడానికి కావలసిన పదార్థాలు:
అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్
ఓట్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్
ఓట్స్ హీల్ స్క్రబ్ ఇలా తయారు చేయాలి?
ఓట్స్ హీల్ స్క్రబ్ చేయడానికి.. ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
అందులో అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్, ఓట్స్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయాలి.
ఆ తర్వాత ఈ రెండింటినీ బాగా కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
ఇప్పుడు మీ ఓట్స్ హీల్ స్క్రబ్ సిద్ధంగా ఉంది.
ఓట్స్ హీల్ స్క్రబ్‌ను మడమలకు ఎలా అప్లై చేయాలి?:
ఓట్స్ హీల్ స్క్రబ్ వేసుకునే ముందు.. మీ పాదాలను శుభ్రం చేసుకోండి.
ఆ తర్వాత తయారు చేసిన స్క్రబ్‌ని మీ మడమల మీద బాగా అప్లై చేయండి.
మీరు సుమారు 5 నుంచి 7 నిమిషాల పాటు చీలమండలను స్క్రబ్ చేయండి.
తర్వాత శుభ్రమైన గుడ్డతో మీ పాదాలను తుడవండి.
మీ పాదాలను వేడి నీటిలో కాసేపు ముంచి కూర్చోండి.
అప్పుడు ప్యూమిస్ స్టోన్ సహాయంతో మీ పాదాలను కొద్దిగా స్క్రబ్ చేయండి.
పాదాలను తుడుచుకున్న తర్వాత, కొబ్బరి నూనెను రాసుకుని నిద్రపోవాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్
Also read: Kalatapasvi K Viswanath Death : అందుకే ఆయన ఈరోజే చనిపోయారేమో.. కళాతపస్వి మృతిపై చిరు ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook