Shaahi Chicken Korma: షాహి చికెన్ కుర్మా రెసిపీ.. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ..

Shaahi Chicken Korma:  వేయించిన మసాలాలతో తయారు చేసే ఈ షాహి చికెన్ కుర్మా రుచికరంగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కుర్మా తయారు చేసే విధానం తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Jul 9, 2024, 09:48 PM IST
Shaahi Chicken Korma: షాహి చికెన్ కుర్మా రెసిపీ.. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ..

Shaahi Chicken Korma: చికెను రకరకాలుగా వండుకుంటాం. అయితే రెస్టారెంట్ స్టైల్లో షాహి, చికెన్ కుర్మాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది మొగలాయి పద్ధతిలో తయారు చేసే ఈ రెసిపీలో మంచి ఆరోమా ఉండే మసాలాలు వేసి తయారు చేసుకుంటాం. వేయించిన మసాలాలతో తయారు చేసే ఈ షాహి చికెన్ కుర్మా రుచికరంగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ కుర్మా తయారు చేసే విధానం తెలుసుకుందాం.

షాహి చికెన్ కుర్మా కి కావలసిన పదార్థాలు..
చికెన్- కేజీ 
ఉల్లిపాయలు -4
 ఆయిల్-ఒక కప్పు
 వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్ 
యాలకుల 5 
ధనియాల పొడి -రెండు టేబుల్ స్పూన్లు 
నల్ల మిరియాలు 
దాల్చిన చెక్క -ఒక ఇంచు
 డ్యాష్ షుగర్ ఒకటి
 టమాటాలు - రెండు
పాలు -అర కప్పు
వెల్లుల్లి పేస్టు -TBSP
ధనియాల పొడి -TBSP
ఎండుమిర్చి-3 
ఉప్పు -రుచికి సరిపడా
 కసూరి మేతి =ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్
 రెండు బిర్యానీ ఆకు
పెరుగు- అరకప్పు 
కొత్తిమీర 
కుంకుమపువ్వు - కొద్దిగా

ఇదీ చదవండి: ఘుమఘుమలాడే పుదీనా చికెన్‌.. అబ్బొ చూస్తేనే నోరూరిపోతుంది..

షాహి చికెన్ కుర్మా తయారీ విధానం..
ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి అందులోంచి నీరు తీసేయాలి పసుపు, ఉప్పుతో మ్యారినేట్‌ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బ్లెండర్ తీసుకొని 20 జీడిపప్పులు గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఉల్లిపాయ పెరుగు కూడా వేసుకోవాలి.

ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇందులో ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు మంట తగ్గించి కడాయిలోనే మసాలాలను వేసి వేయించుకోవాలి. మొత్తం మసాలాలు రెడ్ చిల్లి, జీలకర్ర అన్ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే టమాట, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. 

ఇదీ చదవండి: ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతే ఏం చేయాలో తెలుసా? ఈ టిప్స్ మీ కోసమే..

మసాలాలు అయ్యాక ఈ చికెన్ కూడా వేసి వండుకోవాలి జీడిపప్పు మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సమయంలో చిన్న బౌల్లో పాలు కుంకుమపువ్వు వేసి కూరలో వేసుకొని కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ఉడికే వరకు మూత పెట్టి వండుకోవాలి. చివరగా కసూరి మేతి కొత్తిమీర వేసి వేడివేడిగా పట్టించుకుంటే రుచి అదిరిపోతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News