Zero Oil Soya Biryani: జీరో ఆయిల్ సోయా బిర్యానీ.. రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి?

Zero Oil Soya Biryani: ఎప్పుడూ ఒకేరకమైన బిర్యానీ చేసుకుని బోర్‌ కొడుతోందా? ఈసారి సోయాతో ఆయిల్‌ లేకుండా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి? తెలుసుకుందాం. అధిక బరువు ఉన్నవాళ్లు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు ఈ జీరో ఆయిల్ సోయా బిర్యానీని టేస్టీగా తయారు చేసుకోవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : May 5, 2024, 12:05 PM IST
Zero Oil Soya Biryani: జీరో ఆయిల్ సోయా బిర్యానీ.. రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి?

Zero Oil Soya Biryani: ఎప్పుడూ ఒకేరకమైన బిర్యానీ చేసుకుని బోర్‌ కొడుతోందా? ఈసారి సోయాతో ఆయిల్‌ లేకుండా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి? తెలుసుకుందాం. అధిక బరువు ఉన్నవాళ్లు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు ఈ జీరో ఆయిల్ సోయా బిర్యానీని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో నుంచి మంచి ఆరోమా వస్తుంది. ఇంట్లోనే ఈజీగా ఉన్న వస్తువులతో తయారు చేసుకోవచ్చు.

బిర్యానీకి కావలసిన పదార్థాలు..
బియ్యం -ఒక కప్పు 
వెల్లుల్లి 12 రెబ్బలు 
అల్లం -అర ఇంచు 
ఉల్లిపాయలు -6
 పచ్చిమిర్చి -3
ఉప్పు రుచికి సరిపడా 
ఒక కప్పు సోయాబీన్స్ 
బిర్యానీ మసాలా- 4 tbsp
ఆలుగడ్డలు - 2
గసగసాలు -2 tbsp
జీలకర్ర -2tbsp
జీడిపప్పు -2 tbsp
బే లీఫ్స్‌-2
పసుపు పొడి -2 tbsp
కారంపొడి -2tbsp
పెరుగు - ఒక కప్పు 
ధనియాలు - 2 tbsp
కొత్తిమీర- 2 tbsp

జీరో ఆయిల్ సోయా బిర్యానీ తయారీ విధానం..
జీరో ఆయిల్ సోయా బిర్యానీ తయారీకి ముందుగా అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటన్నిటిని కలిపి మెత్తగా పేస్ట్ మాదిరి బ్లెండ్ చేసుకోవాలి. మరొక బ్లెండర్లో జీడిపప్పు, గసగసాలు వేసి మెత్తగా పేస్టు మాదిరి తయారు చేసుకోవాలిఅలాగే ధనియాలు, జీలకర్ర పౌడర్ ని కూడా సన్నగా బ్లెండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు ఉల్లిపాయలను సన్నగా తరిగినవి ఓ ప్యాన్‌ స్టవ్‌ ఆన్‌ చేసి ప్యాన్‌లో వేసుకుని వేయించుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్‌ ఆనియన్స్ రెడీ అవుతాయి.

ఇదీ చదవండి: ప్రతిరోజూ రాత్రి ముఖానికి ఐస్‌క్యూబ్స్‌ రాసుకుంటే చాలు.. ఈ ఎండకాలం ఎలాంటి స్కిన్‌కేర్‌ అవసరమేలేదు..!

మరో స్టవ్ పై రైస్ కుక్ చేయాలి. ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా ఉప్పు వేసి 90% వరకు అన్నం ఉడికించుకోవాలి. అయితే ఆలుగడ్డలు సోయాబీన్స్ కూడా ఉడికించి పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు బిర్యానీ ఆకు కారంపొడి వేసి ఉడికించుకోవాలి . ఉడికిన తర్వాత అధికంగా ఉన్న నీటిని వడకట్టేసేయాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న ఆలుగడ్డ బీన్స్ లోకి పెరుగు జీడిపప్పు గసగసాల పేస్టు జిలకర, ధనియాల పౌడర్, పసుపు, కారంపొడి బిర్యానీ మసాలా, ఉప్పు కూడా రుచి చూసి మ్యారినేట్ చేసుకోవాలి.

ఇదీ చదవండి: ఈ ఎండలకు ఏసీతో పనిలేకుండా మీ ఇంటిని చల్లబరిచే 5 చిట్కాలు..

బిర్యానీ చేసుకునేందుకు ఒక డీప్ బాటం ఫ్యాన్ లో రైసు సోయాబీన్ పొటాటోస్ ఒకో లేయర్ వేసుకుంటూ కుంకుమపువ్వు నీళ్లు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటూ రెండు లేయర్స్ వేసుకొని మూత గట్టిగా పెట్టుకోవాలి. దీనికి గోధుమ పిండితో మూతను ఆవిరి పోకుండా పెట్టుకోవాలి. ఓ 15 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు రుచికరమైన జీరో ఆయిల్ సోయా బిర్యానీ రెడీ. వేడివేడిగా సర్వ్‌ చేసుకోండి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News