Acidity Relief Remedies: గ్యాస్‌, ఎసిడిటీతో బాధపడుతున్నారా.. అయితే ఈ అద్భుమైన చిట్కాల‌ను పాటించండి..!

Instant Relief From Acidity At Home: ప్రస్తుతం మారిన జీవనశైలి కారంణంగా గ్యాస్‌, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా కీళ్ల నొప్పులు, గుండె సమస్యలు ఇతర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కొన్ని ఇంటి చిట్కాలు ఎంతో సహాయపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Jul 17, 2024, 11:27 AM IST
Acidity Relief Remedies: గ్యాస్‌, ఎసిడిటీతో బాధపడుతున్నారా.. అయితే ఈ అద్భుమైన చిట్కాల‌ను పాటించండి..!

Instant Relief From Acidity At Home: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే ప్రాణాంతకమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎసిడిటీ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం తినే ఆహారంలో అధిక శాతం కారం, మసాలాలు ఇతర అనారోగ్యకరమైన పదార్థాలు తినడం వల్ల ఈ సమస్య కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉదయం టీ, కాఫీలు తాగినా కూడా అసిడిటీ వస్తుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందటం కోసం కొన్ని అద్భుతమైన ఇంటి చిట్కాలు సహాయపడుతాయని వైద్యులు చెబుతున్నారు. 

మనం ప్రతిరోజు వంటలో ఉపయోగించే పదార్థాలు ఆహారాని రుచికరంగా మార్చడే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో జీలకర్ర ఒకటి. జీలకర్ర నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల గ్యాస్‌, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఒక గిన్నెలో నీళ్లను తీసుకొని టీస్పూన్‌ జీలకర్రను కలుపుకోవాలి. ఈ నీళ్లను బాగా మరిగించి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా ప్రతిరోజు ఉదయం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.  

మనలో చాలా మంది కొంచెం ఆహారం తీసుకున్న తరువాత కడుపు ఉబ్బరంగా, గుండెలో మంటగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు ఐదు పుదీనా ఆకులను నమిలి తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. పుదీనా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. పుదీనా నేరుగా తినడానికి కష్టంగా ఉంటే జ్యూస్‌ తయారు చేసుకొని తాగవచ్చు. 

కడుపులో మంట, ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలకు చెక్‌ పెట్టడంలో సోంపు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్‌, ఫైబర్‌ వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. సోంపు గింజలను నీటిలో వేసి బాగా మరిగించి రంగు మారిన తరువాత వడకట్టుకోవాలి.  నీళ్లు గోరు వెచ్చగా ఉన్నప్పుడు దీని తాగేయాలి. ఇలా ప్రతిరోజూ రాత్రి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు చక్కటి నిద్ర కూడా పడుతుంది.  

కడుపు సంబంధిత సమస్యలను నివారించడానికి కొత్తిమీర ఎంతో సహాయపడుతుంది. కొత్తమీర ఆకులతో తయారు చేసే నీటిని తాగడం వల్ల కడుపు శుభ్రం అవుతుంది. అలాగే గ్యాస్‌, మంట వంటి సమస్యలు తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు. కొత్తిమీరలో విటమిన్ -ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలు పొట్ట సమస్యలు తగ్గించడంతో పాటు ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News