How To Reduce Belly Fat In 15 Days: గర్భధారణ సమయంలో స్త్రీలు బరువు చాలా వరకు పెరుగుతూ ఉంటారు. కానీ డెలివరీ అయిన నెలరోజుల వరకు బరువు సాధారణ స్థితికి చేరుకోకపోవడమే ప్రస్తుతం సమస్య మారింది. అయితే ఇలాంటి సమస్యలు వల్ల భవిష్యత్‌లో చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. అయితే ఈ క్రమంలో వ్యాయామాలు చేయడం చాలా కష్టం కాబట్టి పలు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పోషకాలు, విటమిన్లు ఉండే వాటిని తీసుకోవడం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే ఇదే క్రమంలో పలు రకాల హెల్తీ డ్రింక్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ డ్రింక్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి:
వేడి నీటిలో తేనె కలుపుకుని తాగడం:
రోజూ ఖాళీ కడుపుతో ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే ఇదే క్రమంలో నిమ్మరం వేసకుని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
గ్రీన్ టీ:
పొట్ట చుట్టు కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గ్రీన్ టీ ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా గ్రీన్‌టీని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కరివేపాకు మరిగించిన నీరు:
ఆయుర్వేదంలోకరివేపాకును ఓ ఔషధంగా పరిగణిస్తారు. ఇందులో బాడికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే ఈ ఆకులను మరించిన నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ప్రయోజనాలు లభించడమేకాకుండా బరువు కూడా సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
దాల్చిన చెక్క నీరు:
దాల్చిన చెక్కను మరిగించిన నీటిని తాగడం వల్ల పొట్ట చుట్టు పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇదే నీటిలో అర టీస్పూన్ తేనెను వేసుకుని తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook