Herbs For Hair Fall: వాతావరణ మార్పుల కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల బారిన పెద్దవారే కాకుండా చిన్న పిల్లలు కూడా పడుతున్నారు. జుట్టు లేకుంటే ముఖ్యంగా అందహీనంగా తయారవుతుంది. కాబట్టి చాలా మంది జుట్టును దృఢంగా చేసుకోవడానికి మార్కెట్ లభించే చాలా రకాల ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇవి చాలా రేట్లు ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు తప్పకుండా తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలను పాటించాల్సి ఉంటుంది..
వీటితో జుట్టు సమస్యలకు చెక్:
కలబంద జెల్:
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కలబంద ప్రభావవంతంగా కలబంద సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును దృఢంగా చేసేందుకు సహాయపడతాయి. హెయిర్ వాష్ చేయడానికి అరగంట ముందు అలోవెరా జెల్‌ను జుట్టుకు అప్లై చేసి..బాగా మసాజ్ చేసి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది.
ఉసిరికాయ:
ఉసిరి జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మరియు విటమిన్ ఇ జుట్టును దృఢంగా చేస్తాయి. ఉసిరి నూనె లేదా రసంతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి.
మందార:
ప్రతిచోటా మందార పువ్వులు కనిపిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించడానికి మందార పువ్వులు కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. కొబ్బరి నూనె లేదా ఆవాల నూనెలో మందార వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నూనెను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.