Hyderabadi Biryani Masala: హైదరాబాద్‌ బిర్యానీ మసాలను ఇలా సుభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..!

Hyderabadi Biryani Masala: ప్రపంచంలో హైదరాబాద్‌ బిర్యానీకి ఓ గుర్తింపు ఉంది. దీని పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. అందరూ దీనిని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ బిర్యానీని వండే క్రమంలో చాలా రకాల సుగంధ ద్రవ్యాలను వాడుతూ ఉంటారు. కావున దీని రుచిని అందరూ లైక్‌ చేస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 25, 2022, 12:22 PM IST
  • ప్రపంచంలో హైదరాబాద్‌ బిర్యానీకి ఓ ప్రత్యేకత ఉంది
  • దీనిని సుభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
  • దీని కోసం కావాల్సిన పదార్థాలు
Hyderabadi Biryani Masala: హైదరాబాద్‌ బిర్యానీ మసాలను ఇలా సుభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..!

Hyderabadi Biryani Masala: ప్రపంచంలో హైదరాబాద్‌ బిర్యానీకి ఓ గుర్తింపు ఉంది. దీని పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. అందరూ దీనిని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ బిర్యానీని వండే క్రమంలో చాలా రకాల సుగంధ ద్రవ్యాలను వాడుతూ ఉంటారు. కావున దీని రుచిని అందరూ లైక్‌ చేస్తారు. ముఖ్యంగా ఇందులో ఉండే మసాల శరీరానికి అనేక రకాల పోషక విలువలను అందించేందుకు దోహదపడుతుంది. అయితే ప్రపంచంలో చాలా  బిర్యానీలు ఉన్న హైద‌రాబాదీ బిర్యానీ ఎందుకంత ప్రత్యేకత అంటే..?. దీనిని తయారు చేసే క్రమంలో వాడే మసాలనే అని చెప్పొచ్చు. ఈ మసాలే బిర్యానికి రుచిని అందజేస్తుంది. అయితే ఈ మసాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మసాల తయారు చేసుకోవడానికి కావ‌ల్సిన ప‌దార్థాలు (hyderabadi biryani masala ingredients)

- ముక్క‌లుగా చేసిన బిర్యానీ ఆకులు – 2
- న‌ల్ల యాల‌కులు – 2
- మ‌రాఠీ మొగ్గ‌లు – 2
- దాల్చిన చెక్క ముక్క‌లు – 2
- జాజికాయ – అర ముక్క‌
- అనాస పువ్వులు – 3
- యాల‌కులు – 10
- ల‌వంగాలు – 15
- జాప‌త్రి – 2
- మిరియాలు – ఒక టీ స్పూన్
-ధ‌నియాలు – పావు క‌ప్పు
- జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్
- సాజీరా – ఒక టీ స్పూన్
- సోంపు గింజ‌లు – ఒక టీ స్పూన్

మసాలను ఇలా సులభంగా తయారు చేసుకోండి..

ముంగా ఓ చిన్న బౌల్‌ తీసుకోని.. దానిని చిన్న మంట‌పై పెట్టి అనాస పువ్వులు, యాల‌కులు, న‌ల్ల యాల‌కులు, మ‌రాఠీ మొగ్గ‌,  జాప‌త్రి, ధ‌నియాలు, జాజికాయ‌ 5 నిమిషాల పాటు నెమ్మదిగా వేపుకోవాలి.  దీనిలో ఇప్పుడు రెండు బిర్యానీ ఆకుల‌ను వేసి లేతగా వేయించాలి.. ఆ తర్వాత మంటను ఆఫ్ చేసి.. వాటిని చల్లరే దాక పక్కన పెట్టండి. ఇప్ప‌డు ఒక కడాయిని తీసుకుని అందులో ఈ మసాల దినుసులను సన్నని పొడిగా చేయాలి. ఇలా పొడిగా చేసిన మసాలను ఓ గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. మీకు కావాల్సినప్పు బిర్యానికి చేసే క్రమంలో దీనిని వాడుకోవచ్చు. ఇది బిర్యానికి చక్కని రుచిని అందించడమే కాకుండా.. మంచి గుమగుమలాడించే సువాసనను ఇస్తుంది.

Also Read: Tomato Juice for weight loss: టమోటాలను ఇలా వాడితే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు సగం తగ్గిపోతుంది

 

Also Read:  White Onion Benefits: తెల్ల ఉల్లిపాయలను తింటే.. ఈ సమస్యలు దూరమవుతాయి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News