ఇండియాలోని యువతలో 33 శాతం మంది తమను ప్రేమించే వారికన్నా స్మార్ట్ ఫోన్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని మోటరోలా సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. మరో 50 శాతం మంది అవసరం లేకున్నా, ఉన్నా తరచూ మొబైల్ ఫోన్లు చెక్ చేస్తుంటారు అని తెలిపింది. దీంతో పాటు మొబైల్ పై మానసికంగా ఎక్కువ ఆధారపడిన వారి జాబితాలో 65 శాతంతో భారత్ అగ్రభాగాన నిలిచిందన్న సర్వే.. ఈ సంఖ్య గత పదేళ్లతో పోలిస్తే రెట్టింపు అయ్యిందని స్పష్టం చేసింది.
'దాదాపు 65 శాతం మంది ప్రజలు తమ స్మార్ట్ ఫోన్లను కోల్పోతే, తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఫోన్ కోల్పోతే విపరీతంగా దిగాలుపడే వారిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. 77 శాతం మంది వారు తమ ఫోన్ను కోల్పోయినప్పుడు ఆందోళన చెందుతున్నారు' అని సర్వే స్పష్టం చేశారు.