Infertility Reasons: పెరుగుతున్న సంతానలేమి సమస్య, మహిళలే కాదు పురుషులు కూడా కారణమే

Infertility Reasons: ఇండియాలో దాదాపు 10 నుంచి 14 శాతం జంటలు ఇన్‌ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు. మెట్రో నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ప్రతి ఆరు జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్న పరిస్థితి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2023, 01:17 PM IST
Infertility Reasons: పెరుగుతున్న సంతానలేమి సమస్య, మహిళలే కాదు పురుషులు కూడా కారణమే

ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రీప్రొడక్షన్ ప్రకారం ఇన్‌ఫెర్టిలిటీ అనేది పురుషులు, మహిళలు ఇద్దరిపై ప్రభావం చూపిస్తోంది. ఈ పరిస్థితికి కారణాలేంటి, జీవనశైలిలో ఏ విధమైన మార్పులు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనేది పరిశీలిద్దాం..

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫెర్టిలిటీ సమస్య 10-14 శాతముంది. ఏడాది నుంచి పిల్లల కోసం ప్రయత్నిస్తూ విఫలమౌతుంటే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే గర్భం దాల్చకపోవడానికి చాలా కారణాలుంటాయి. ఇందులో చాలా కారణాలను చికిత్స, జీవనశైలిలో మార్పులతో సరి చేయవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

ఇప్పటికీ చాలామందికి సంతానలేమి సమస్యలో ఐవీఎఫ్ ప్రక్రియ ఎలా పనిచేస్తుందనేది తెలియదు. సంతానలేమి సమస్యకు ఐవీఎఫ్ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం. సాంప్రదాయ పద్దతిలో గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తూ విఫలమయ్యేవారికి ఐవీఎఫ్ మంచి పరిష్కారాన్నిస్తుంది. ఇలాంటి దంపతులు చికిత్స, జెనెటిక్, లైఫ్‌స్టైల్ సంబంధిత సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఇదేమీ చికిత్స లేనిది కాదు. వైద్యుల ప్రకారం మగవారిలో స్పెర్మ్‌కౌంట్ సమస్య తక్కువగా ఉండటం, మహిళల్లో అండాల లోపం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. ఇక ఇతర కారణాల్లో..లైఫ్‌స్టైల్, పర్యావరణ స్థితి, డ్రగ్స్ అలవాటు, మద్యం, ధూమపానం వంటి ఇతరత్రా అలవాట్లున్నాయి. అంతేకాకుండా పీసీఓడీ, డయాబెటిస్, థైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడేవారు కూడా ఇన్‌ఫెర్టిలిటీ సమస్య ఎదుర్కొంటారు.

సాధారణంగా సంతానలేమి అంటే మహిళల్లోనే ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ 20 శాతం పురుషులు, మహిళలు ఇద్దరూ కారణమౌతారు. మిగిలిన 80 శాతంలో మహిళలు, పురుషులు చెరో 40 శాతం కారణమౌతుంటారు.

మహిళల్లో సంతానలేమికి కారణాలు

పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ సమస్య, ఎండోమెట్రియాసిస్, పోలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, ఫాలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్, థైరాయిడ్, ఫైబ్రాయిడ్

పురుషుల్లో సంతానలేమికి కారణాలు

స్పెర్మ్‌కౌంట్ తక్కువగా ఉండటం, ధూమపానం, మద్యం, డ్రగ్స్ సేవించడం, ఓవర్ ఎక్సర్‌సైజ్, వేడి, టైట్ డ్రెసెస్ వేయడం, ఒత్తిడి

Also read: Black Tea: డయాబెటిస్, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చెక్, రోజూ తాగితే కేవలం నెలరోజుల్లో ఫలితాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News