No Rain Village: ఇప్పటి వరకు వర్షం పడని ప్రాంతం...! మేఘాల పైన ఉండే వింత గ్రామం..!

Strange Village: ఈ పుడమి ఎన్నో రహస్యాలకు, వింతలకు పుట్టినిల్లు. ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ వింత గురించి మనం చెప్పుకుందాం. ఈ భూమి మీద అసలు వర్షమే కురవని గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా..? నిజమండీ..అలాంటి గ్రామం ఉందంట. ఎక్కడంటే..

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 02:25 PM IST
No Rain Village: ఇప్పటి వరకు వర్షం పడని ప్రాంతం...! మేఘాల పైన ఉండే వింత గ్రామం..!

No Rain Village: ఈ భూమి రహస్యాలకు పుట్టినిల్లు. కొన్ని వింతలు చూస్తుంటే..ఆశ్చర్యపోక తప్పదు. ఈ ప్రపంచంలో అంతుచిక్కని మిస్టరీస్(Mysteries) ఎన్నో ఉన్నాయి. . ఓ చోట ఎండలు మండిపోతాయి. మరోచోట చలి వణికిస్తుంది. మరోచోట ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇంకోచోట అస్సలు వర్షమే కురవదు. అటువంటి వింత గ్రామం(Strange Village) గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఈ భూమి మీద వర్షం కురవని ఓ వింత గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’(Al-Hutaib). ఇది యెమెన్(Yemen) రాజధాని సనా(sanaa)కు పశ్చిమాన ఉంది. ఇక్కడ వర్షం కురవక పోయినా జనాలు హాయిగా జీవిస్తారు. భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గ్రామంలో వాతావరణం వేడిగా ఉంటుంది. శీతా కాలంలో ఉదయం చల్లగా, మధ్యాహ్నం వేడిగానూ ఉంటుంది. ఇక్కడి పరిస్థితులు ఆ గ్రామ ప్రజలకు అలవాటే. ఈ వింత ప్రదేశానికి వచ్చేందుకు పర్యాటకులు(Tourists) క్యూ కడతారు. ఈ గ్రామంలో పాత కాలపు నిర్మాణలతో పాటు.. కొత్త నిర్మాణాలు కూడా దర్శనమిస్తాయి. ఎప్పుడూ వర్షం పడకపోవటానికి కారణం ఈ గ్రామం మేఘాలకు మించి ఎత్తులో ఉంటుంది. ఈ విలేజ్ కు దిగువ భాగాన మాత్రం మేఘాలు (clouds) ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాలు పడటాన్ని ఈ గ్రామస్థులు చూస్తారట.

Also Read: Three Head Snake: నెట్టింట మూడు తలలపాము ఫోటో వైరల్...అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..

నీటి సరఫరా ఎలా అంటే..

వాస్తవానికి యెమెన్‌లో నీటి సమస్య ఎక్కువే. పైగా సనాలో అది మరీ ఎక్కువ. ప్రపంచంలో ‘డ్రై సిటీ’ రాజధాని ఇదొక్కటే. దీంతో సనా మున్సిపల్, వాటర్​ కార్పొరేషన్​ ఈ సమస్యలను తీర్చడానికి 2007లో కొత్త పద్ధతులు ఎంచుకుంది. మొబైల్​వాటర్ ట్యాంకర్లతో సిటీ మొత్తం వాటర్​ సరఫరా చేస్తోంది. అక్కడ ఎత్తైన గ్రామంగా ఉన్న అల్ హుతైబ్‌కు కూడా మొబైల్​ ట్యాంకులతో పాటు, పైపులతో నీళ్లను అందిస్తోంది.

టూరిస్టులకు స్వర్గధామం

కొండపై ఈ గ్రామం ఉండడం వల్ల మేఘాల ప్రయాణం చాలా బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా వర్షం పడితే కొండపై నుంచి కిందికి వస్తూ వర్షాన్ని తాకొచ్చు. అలాగే కొండ కింది భాగంలో చిన్న చిన్న జలపాతాలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రజల జీవిన విధానం, ఇళ్ల ఆర్కిటెక్చర్, చేతికందే మేఘాలు ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ గ్రామాన్ని చూసేందుకు టూరిస్టులు అధికంగా వస్తుంటారట. అల్ హుతైబ్ కొండపై ‘క్వాట్’ అనే మొక్కలను ఎక్కువ పండిస్తారు. దీని నుంచి పూలు, మందులు తయారు చేస్తారు. ప్రధాన ఆదాయంగా ‘క్వాట్​ కల్టివేషన్​’ ఈ గ్రామంలో ఉంటుంది. దీనికి సనా వాటర్​కార్పొరేషన్​ ఈ మొక్కల సాగు కోసం 37శాతం నీటిని అల్ హుతైబ్‌కు అందిస్తుంది.

Also Read: One Euro Houses: అక్కడ రూ.90 లకే సొంతిల్లు..కండిషన్స్ అప్లై..

వివిధ కథనాల ప్రకారం.. ‘అల్-హుతైబ్’ గ్రామంలో ఆల్ బోహ్రా లేదా అల్ ముకర్మా(Al Bohra Al Mukarrama) ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీలు అంటారు. వారు ముంబైలో నివసించిన మహమ్మద్ బుర్హానుద్దీన్(Mohammad Burhanuddin) నేతత్వంలోని ఇస్మాయిలీ (ముస్లిం) శాఖ నుండి వచ్చారు. మహమ్మద్ బుర్హానుద్దీన్ 2014 లో మరణించే వరకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ గ్రామాన్ని సందర్శించేవారు. ఇలా ఇప్పటి వరకు వర్షం పడని గ్రామం ఉంటుందని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ గ్రామం గురించి వింటుంటే వింతగానే ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News