Jaggery Benefits: మనలో చాలా మంది తీపి పదార్ధాలు తినడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. అధికంగా షుగర్ ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ సమస్యతో బాధపడాలి ఉంటుంది. అయితే చక్కెరకు బదులుగా బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిది. బెల్లం తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో తెలుసుకుందాం.
ఆయుర్వేదనిపుణుల ప్రకారం ప్రతిరోజు బెల్లం తినడం వల్ల శరీరంలో ఊహించని మార్పులు కలుగుతాయని చెబుతున్నారు. ఇది సహజ స్వీటెనర్. బెల్లం తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది వివిరాలు తెలుసుకుందాం.
బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
బెల్లం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, అసిడీటి వంటి సమస్యలను తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ఒక ముక్క బెల్లం తినడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్త హీనత సమస్యలు తగ్గుతాయి. అలాగే శ్వసకోశ సంబంధిత జబ్బులతో బాధపడేవారు కూడా ఈ బెల్లం ముక్కను తీసుకోవడం చాలా మంచిది. చలికాలంలో బెల్లం తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు, మెడ నొప్పులు, ఎముకల నొప్పితో బాధపడేవారు బెల్లం తినడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి తో బాధపడేవారు బెల్లం తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా మనోధైర్యాన్ని పెంచడంలో బెల్లం ఎంతో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
చక్కెర కంటే బెల్లం ఎందుకు మంచిది
చక్కెరలో ఎలాంటి పోషకాలు ఉండవు. కానీ బెల్లంలో ఐరన్, జింక్, కాల్షియం వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుతాయి. అలాగే షుగర్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. బెల్లం తినడం వల్ల ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది. అంతేకాకుండా బెల్లం తినడం వల్ల శరీరం కోలిపోయిన శక్తిని మళ్ళీ పొందవచ్చు. చక్కెర మాత్రం కేవలం ఉపశమనం అందిస్తుంది.
బెల్లం కూడా ఒక రకమైన చక్కెరే. కాబట్టి దీనిని అధికంగా తీసుకోవడం బరువు పెరగడానికి కారణం కావచ్చు. షుగర్ ఉన్నవారు బెల్లం తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ముగింపు:
బెల్లం చక్కెర కంటే ఆరోగ్యకరమైన పదార్థం. అయితే అతిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలగవచ్చు.
Also Read: Orange Seeds: పొరపాటున కూడా ఈ గింజలు పడేయకండి.. దీని వల్ల లాభాలెన్నో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.