Jonna Pindi Idli: ఈ ఇడ్లీలు తింటే సర్వ రోగాలు మటుమాయం.. మీ ఆరోగ్యం కోసమే ఈ రెసిపీ..

Jonna Pindi Idli Recipe In Telugu: చాలామంది అల్పాహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలనుకుంటారు. అయినప్పటికీ సమయం లేకపోవడం కారణంగా తీసుకోలేక పోతారు. ఇక ఇంట్లోనే సులభంగా అతి తక్కువ సమయంలో ఇలా జొన్న రవ్వ ఇడ్లీలను తయారు చేసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 10, 2024, 03:20 PM IST
Jonna Pindi Idli: ఈ ఇడ్లీలు తింటే సర్వ రోగాలు మటుమాయం.. మీ ఆరోగ్యం కోసమే ఈ రెసిపీ..

Jonna Pindi Idli Recipe In Telugu: చాలామంది ఉదయాన్నే మైసూర్ బజ్జీ అని.. నూనెతో కూడిన వడను అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. దానికి వీటిని ప్రతిరోజు తింటూ పోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి కారణంగా కొంతమందిలో క్యాన్సర్ కూడా వస్తుందని ఇటీవలే కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఎందుకంటే ఎక్కువగా వాడిన నూనెను వాడుతూ ఉండడం.. వీటిని అందులోనే వేయించడం వల్ల ఆహారాలన్నీ కల్తీ అయిపోతున్నాయి. దీని కారణంగా చాలామందిలో కొన్ని ఏళ్ల తర్వాత క్యాన్సర్ వస్తోంది. వీటికి బదులుగా ది బెస్ట్ జొన్న ఇడ్లీ ని తీసుకుంటే ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జొన్నలో ఉండే వివిధ పోషకాలు శరీర ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే కొన్ని ప్రత్యేకమైన మూలకాలు శరీర బరువును తగ్గించి.. రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తాయి.

చాలామంది జొన్న రోటీలను ఇంట్లో తయారు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. రోటీలకంటే స్పీడ్ గా ఈ ఇడ్లీలను కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇతర ఇడ్లీల కంటే జొన్న ఇడ్లీలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి వీటిని పిల్లలకు కూడా అల్పాహారంగా ఇవ్వవచ్చు. పిల్లలకు అల్పాహారంగా ఇవ్వడం వల్ల వారి శరీరం ఆరోగ్యవంతంగా తయారవ్వడమే కాకుండా తగినన్ని పోషకాలు కూడా అందుతాయి. అయితే ఈ జొన్న ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో.. దానికి కావలసిన పదార్థాలు ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి ఇప్పుడు..

కావలసిన పదార్థాలు:
జొన్న రవ్వ - 1 కప్పు
ఉప్పు - రుచికి తగినంత
పెరుగు - 1/2 కప్పు
నీరు - అవసరమైనంత
నూనె - ఇడ్లీ బుట్టలను నూనె రాసుకోవడానికి

తయారీ విధానం:
జొన్న ఇడ్లీలను తయారు చేసుకోవడానికి ముందుగా ఒకరోజు ముందు రాత్రే రవ్వను రెండు రేట్లు అధికంగా నీటిని పోసుకొని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత ఇందులోనే కాస్తంత ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఈ రెండిటినీ బాగా మిక్స్ చేసుకొని మరో 30 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 
ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ పిండిలో ఉప్పు పెరుగు కలిపి మరో 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత ఈ ఇడ్లీ బ్యాటర్ ను ఇడ్లీ పాత్రలపై వేసుకొని కుక్కర్ లో పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాల వరకు బాగా స్ట్రీమ్ చేసుకోండి. 
టూత్ పిక్ తో ఇడ్లీలను ఉడికినవా లేదోనని చెక్ చేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకోండి. అంతే సులభంగా జొన్న రవ్వ ఇడ్లీలు తయారైనట్లే. 
ఇలా తయారు చేసుకున్న ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం మీ సొంతం..

చిట్కాలు: 
జొన్న రవ్వను నానబెట్టుకునే క్రమంలో తగిన మోతాదులో మాత్రమే నీటిని వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే పిండి పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. 
ఈ బ్యాటర్ లో ఇడ్లీ రవ్వ కలిపిన తర్వాత మిక్సీ కొట్టుకోవడం వల్ల ఇడ్లీ మరింత సాఫ్ట్నెస్ గా మారుతుంది. 
ఇడ్లీ బాటర్ను కలుపుకున్న 24 గంటల తర్వాత ఇడ్లీలు వేసుకుంటే అద్భుతమైన టేస్టు లభిస్తుంది. అంతేకాకుండా ఇడ్లీలు పంజిల్లాగా వస్తాయి..

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News