Revanth Musi Yatra: మూసీ ప్రాజెక్టు అంశంలో మరోసారి రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. బుల్డోజర్లకు అడ్డంగా ఎవరు వచ్చినా వారిపై బుల్డోజర్లు ఎక్కించి తొక్కుతానని సంచలన ప్రకటన చేశారు. ఎవరు అడ్డొచ్చినా.. ఏం చేసినా తాను అనుకున్నది చేసి తీరుతానని ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్, హరీశ్ రావుతోపాటు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు, మీ చుట్టాలు.. మీ జాతి ఎవరు వచ్చినా పండపెట్టి తొక్కుతానని వ్యాఖ్యానించడంతో మరోసారి రేవంత్ ప్రసంగంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను 'మూసీ సుందరీకరణకు కేసీఆర్ అడ్డం పడితే మూసీలో దిక్కులేని కుక్క సావు చస్తావు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుట్టినరోజు కూడా రేవంత్ రెడ్డి అత్యంత దారుణంగా మాట్లాడడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Musi Yatra: రేవంత్ రెడ్డి మూసీ యాత్రలో అపశ్రుతి.. బొక్కబోర్లా పడిన ఫొటోగ్రాఫర్లు
మూసీ ప్రాజెక్టుకు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెంలో శుక్రవారం రోడ్డు షో చేపట్టారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించిన ఆయన ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇవాళ నా జన్మదినం కాదు.. నా జన్మ ధన్యమైంది' అని ప్రకటించారు. 'శివయ్య సాక్షిగా చెబుతున్నా ఏది ఏమైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా' అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఇటీవల మాజీ మంత్రి హరీశ్ రావు విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 'జనవరి నెలలో వాడపల్లి నుంచి పాదయాత్ర చేద్దాం. హరీశ్ రావు, కేటీఆర్ పాదయాత్రకు సిద్ధంగా ఉండండి' అని సూచించారు.
Also Read: Yadadri: యాదాద్రి ఆలయానికి రేవంత్ రెడ్డి శుభవార్త.. టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటుకు నిర్ణయం
'నేను కబ్జా చేయాలనుకుంటే కోకాపేటలో 500 ఎకరాలు కబ్జా చేస్తే రూ.50 వేల కోట్లు వస్తాయి. కానీ అలా చేయను' అని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది నల్గొండ ప్రాంతానికి ఒక నాడు వరం.. ఇప్పుడు శాపంగా మారింది. ఈ ప్రాంతంలో గౌడన్నలు కల్లు.. ఇతర ప్రజలు పాలు, మాంసం.. చివరకు పండించే వరిని కూడా అమ్మలేని పరిస్థితి' అని వివరించారు. మూసీ నది అణుబాంబు కంటే ప్రమాదంగా మారిందని తెలిపారు. మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మూసీని ప్రక్షాళన చేయకపోతే తన జన్మ దండగ అని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Revanth Reddy: ఎవరొస్తారో రారి ఒక్కొక్కరిపై బుల్డోజర్లు ఎక్కించి తొక్కుతా: రేవంత్ రెడ్డి